గంజాయి/డ్రగ్స్ వంటి మత్తు నుండి యువతను కాపాడుదాం… DSP రఘు చందర్ గారు
జగిత్యాల జిల్లా :
జగిత్యాల జిల్లా S.P అశోక్ కుమార్ IPS గారి ఆదేశాల మేరకు, ధర్మపురి సిఐ ఏ. రాం నరసింహారెడ్డి గారి సారథ్యంలో,బుగ్గారం మండల ఎస్సై ఎం. శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, శ్రీ గ్లోబల్ హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ నక్కరాజు గారి సభాదక్షతన సామాజిక స్పృహ కార్యక్రమంలొ వివిధ గవర్నమెంట్.
ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ఆరు నుండి పదవ తరగతి వరకు విద్యార్థులను ఉద్దేశించి.. యువత అసాంఘిక కార్యకలాపాలకు, గంజాయి మరియు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జగిత్యాల డిఎస్పీ డి.రఘుచందర్ అన్నారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థిని- విద్యార్తులు మరియు యువతి- యువకులకు గంజాయి / డ్రగ్స్, మత్తు పదార్థాలు, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పిస్తూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకుంటూ యువత పెడదారి పడుతున్న నేపధ్యంలో వారిలో మార్పు తేవాలని ఉద్దేశంతో సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించి, సత్ప్రవర్తన కలిగిన భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.యువత పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అని, గంజాయికి అలవాటుపడిన వారు ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబం తోపాటు దేశానికి కూడా నష్టాన్ని కలిగిస్తాయని చెప్పారు.
గంజాయి తాగుతున్న వారి వివరాలు తెలియజేస్తే వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు ప్రభుత్వం 2 లక్షల నజరానా ఇవ్వడం జరుగుతుంది. గంజాయి మరియు డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడినవారికి కౌన్సిలింగ్ ఇచ్చి సన్మార్గంలో నడిచే విదంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ ఏ. రాం నరసింహారెడ్డి గారు, వివిధ మోటివేషన్ స్పీకర్స్, అడ్వకేట్స్ విద్యార్థి సంఘాల నాయకులు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మొదలగువారు పాల్గొన్నారు.