ప్రకృతి విలయానికి 308 మంది బలి

ప్రకృతి విలయానికి 308 మంది బలి

కేరళలోని వయనాడ్ విలయం తీవ్ర విషాదాన్ని నింపింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 308కి చేరుకుంది.

మండక్కై, చూరాల్ మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యా యి,సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నేవీతోపాటు ఇతర సహాయక బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ లో బిజీగా ఉన్నాయి.

ఇప్పటి వరకు సైన్యం వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలిం చాయి. ప్రకృతి సృష్టించే విపత్తును అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఆ విపత్తును ముందుగానే ఊహిస్తే కాస్త నష్టాన్ని నివారించగలము తప్పా చేసేదేమీ ఉండదు.

అలాంటి అవకాశాన్ని ఇస్రో అందించింది. ఈ సంస్థ రూపొందించి ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా 20ఏండ్లుగా వయనాడ్ జిల్లాతోపాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతా లను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించింది.

దీనిలో భాగంగా తాజాగా వయనాడ్ జిల్లాలో విల యాన్ని చిత్రీకరించింది. వయనాడ్ లో కొండచరి యలు జారిపడిన ద్రుశ్యాన్ని విలయానికి ముందు విల యం తర్వాత ఫొటోలను ఆ ప్రాంతాలపై దృష్టి సారించింది..
కార్టో శాట్ 3 ఆర్ఐఎస్ఏటీ ఉపగ్రహాలు వాటిని రికార్డు చేశాయి.