ACBకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్

ACBకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్

పెద్దపల్లి జిల్లా :

కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అవినీతి రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని తహసి ల్దార్ కార్యాల యంలో మందమర్రికి చెందిన కాడం తిరుపతి, అనే రైతు నుండి కాల్వ శ్రీరాంపూర్ తాహసిల్దార్ జాహిద్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసరి విష్ణు, డ్రైవర్ అంజాద్ లు పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు

కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పందిళ్ళ గ్రామ శివారు లోని సర్వే నంబర్
645/అ లో 28 గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ధ్రువపత్రాలు ఉన్నా కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడడంతో వివాదం నెలకొంది.

పెండింగ్ మోటేషన్ కోసం ఎన్నోసార్లు తహసిల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించక పోవడంతో జిల్లా అధికారు లను కలవగా గత నెల 23న మోటేషన్ పూర్తయింది.

గతంలో పలుమార్లు వీఆర్ ఏ మల్లేశం కుమారుడు విష్ణు కు ఫోన్ పే ద్వారా 15 వేల రూపాయలను తీసుకున్నారని, మరికొంత నగదు కావాలని తిరుపతిని రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేయగా ఏసీబీ అధికారులను సంప్రదించారని తెలిపారు.

ఈ మేరకు ఈరోజు శనివారం తిరుపతి నుండి నగదు తీసుకుంటుండగా తాసిల్దార్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజాద్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

తనిఖీల్లో ఏసీబీ డిఎస్పి రమణమూర్తి, సిఐ కృష్ణకుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు…