SBI ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక!… SBI పేరుతో ఫోన్లకు ఫేక్​ మెసేజ్

SBI ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక!… SBI పేరుతో ఫోన్లకు ఫేక్​ మెసేజ్​…

మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ అంటూ కేటుగాళ్ల మెసేజ్‌

వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోలంటూ సూచ‌న‌

ఇలాంటి సందేశాల ప‌ట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక‌

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు అలర్ట్‌! మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండంటూ ఓ ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర‌ ప్రభుత్వం హెచ్చరించింది.

ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తన అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) హ్యాండిల్ లో ఈ హెచ్చరికను షేర్‌ చేసింది. అయితే, ఎస్‌బీఐ బ్యాకింగ్‌కు సంబంధించి ఫేక్‌ మెసేజ్‌లు సర్క్యూలేట్‌ కావడం ఇదే మొదటిసారి కాదు.

ఫేక్‌ మెసేజ్‌లో ఏముందంటే..
“ప్రియమైన కస్టమర్, మీ ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్‌ల (రూ. 9980.00) గడువు నేటితో ముగుస్తుంది! ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్‌స్టాల్ ద్వారా రీడీమ్ చేసుకోండి. నేరుగా మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుంది” అనేది ఫేక్‌ మెసేజ్ సారాంశం. ఇలాంటి సందేశాల ప‌ట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చ‌రించింది.