తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా CM రేవంత్‌రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా CM రేవంత్‌రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు.

న్యూయార్క్ చేరుకున్న రేవంత్‌ బృందానికి ఎన్‌ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు.

ఈ పర్యటనలో అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్‌ను సందర్శించనున్నారు. ఎనిమిది రోజుల అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో సీఎం బృందం పర్యటిస్తుంది.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్‌ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు.

ఇవాళ ప్రవాస భారతీయులతో సీఎం రేవంత్ సమావేశమవుతారు. రేపు న్యూయార్క్‌లో కాగ్నిజెంట్‌ సీఈవో, సహా ఆర్‌సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్‌ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే ఆర్గా సీఈవో రామకృష్ణ, పీ అండ్‌ వో సంస్థ సీవోవో శైలేష్‌ జెజురికర్, ర్యాపిడ్‌ ఏడుగురు ప్రతినిధులతో సమావేశమవుతారు.

ఈనెల 6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌ చేరుకుంటారు.