నేటితోతెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ముగియనున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీకాలం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటితో మండల ప్రజా ప్రతినిధుల.
పదవీకాలం ముగియ నున్నది. జడ్పిటిసి, ఎంపిటిసిల ఐదు సంవత్సరాలు పదవీకాలం ఆగస్టు 5 సోమవారంతో పూర్తి అవుతుంది.
ఇప్పటికే గ్రామ చాయతీలకు సర్పంచ్ లా పదవీకాలం పూర్తి అయి ఆరు నెలలు ఆయిన పంచాయతీలకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికలు జరపలేదు.
వారి స్థానంలో ప్రత్యేక అధికారులను గ్రామ పంచాయతీలలో నియమించింది.
ఏ ఒక్క ప్రత్యేక అధికారి గ్రామ పంచాయతీల వైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామపంచాయతీల ప్రజల ఆరోపిస్తున్నారు.
దీంతో గ్రామపంచాయతీలో ప్రజా పాలన అటుకెక్కింది.
పంచాయతీ సర్పంచులు లేకపోయినా జడ్పిటిసి, ఎంపిటిసిలు గ్రామాల అవసరాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకొని పోతున్నారు.
వారి పదవి కాలం కూడా పూర్తి కావడంతో గ్రామ పాలన పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే గ్రామాల మౌలిక అవసరాలను పరిశీలించే గ్రామ కార్యదర్శులను బదిలీలు చేయడంతో చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నియమాకం జరగలేదు.
దీంతో పంచాయతీలలో పారిశుద్ధ్యం లేకపోవడంతో వర్షాకాలo గ్రామాల్లో సీజనల్ వ్యాధులు తో పాటుగా దోమలు దోమల వలన విష జ్వరాలు ప్రబులుతున్న పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రజలు
పలు ఇబ్బందులకు గురవు తున్నారు.
మండల పరిషత్ ప్రజాప్రతినిధులకైన ప్రభుత్వం వెంటనే ఎన్నికలు జరుపుతుందా లేక స్పెషల్ అధికారులతో పాలన కొనసాగిస్తుందా అనేది ప్రజల్లో ఉంది.
ఏది ఏమైనా గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నికలు , మండల ప్రజా ప్రతినిధుల ఎన్నికలకు ప్రభుత్వం త్వరగా తిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.