పిచ్చి కుక్క కరిచింది… ఆపై అజ్ఞానం… అసలే పేదరికం… హాస్పిటల్ కి ఆర్టీసీ బస్సులో ప్రయాణం కళ్ల ముందే కన్న బిడ్డ మరణం

పిచ్చి కుక్క కరిచింది… ఆపై అజ్ఞానం… అసలే పేదరికం… హాస్పిటల్ కి ఆర్టీసీ బస్సులో ప్రయాణం కళ్ల ముందే కన్న బిడ్డ మరణం… పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లిన కన్నపేగు…!

అల్లూరి సీతారామరాజు జిల్లా :

గూడెంకొత్తవీధి మండలం తీములబంధ గ్రామానికి చెందిన కొర్రా సుబ్బారావు కుమారుడు కార్తీక్‌(13)ను ఇటీవల కుక్క కరిచింది.

అయితే బాలుడికి తల్లిదండ్రులు వ్యాక్సిన్‌ వేయించలేదు.

దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన కార్తిక్‌ను ఇటీవల చింతపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించాలని సూచించారు.

దీంతో ఆదివారం (ఆగస్టు 3) విశాఖపట్నంలోని కేజీహెచ్‌కి బాలుడిని తీసుకెళ్లారు.

పరీక్షించిన వైద్యులు 3 నెలల క్రితం కుక్క కరచినా.. వ్యాక్సిన్‌ వేయించుకోలేదని తెలుసుకున్నారు.

అప్పటికే ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు కుమారుణ్ని ఇంటికి తీసుకెళ్లేందుకు తిరుగు పయణమయ్యారు. దీంతో ఆదివారం విశాఖపట్నంలో అరకులోయ కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అరకులోయ చేరుకునేలోపే ముందే మార్గంమధ్యలోనే కార్తీక్‌ కన్నుమూశాడు. బిడ్డ చనిపోయాడని గుర్తించిన తల్లిదండ్రులు అరకులోయలో బస్సు దిగి, ఒడిలో కన్నబిడ్డ మృతదేహంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన విలపిస్తూ కనిపించారు. గమనించిన స్థానికులు తలాకొంత ఆర్థికసాయం చేశారు. ఆనోటా ఈనోటా పడి ఈ విషయంకాస్తా అరకు ఎంపీ తనూజారాణి దృష్టికి వెళ్లడంతో.. ఆమె అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు…