78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబు…!!

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబు…!!

దేశ ప్రజల ఉద్దేశించి 11 వ సారీ ప్రధాని ప్రసంగం!!

ఢిల్లీలో హై అలర్ట్…!!

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఆగస్టు 15 గురువారం దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి యావత్తు దేశ ప్రజలు సిద్ధమయ్యారు.

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట పైన జాతీయ జెండాను ఎగరవేసి దేశ ప్రజల ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 వ సారీ ప్రసంగించే అవకాశం లభించింది.

గతంలో 11 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అరుదైన అవకాశం అప్పటి మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ దక్కింది ఆ తర్వాత స్థానంలో 11 సార్లు దేశ ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించే అవకాశం నరేంద్ర మోడీకి దక్కడం విశేషం.

బ్రిటిష్ పాలకొల్లు అంతమంది ఈ దేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించిన బ్రిటిష్ పాలకులను గుండెలలో గూడుకట్టుకొని ఎందరో మహనీయులు పోరాటపరితంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది.

ఆనాటి నుంచి ఇలాంటి వరకు దేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతూ అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు ప్రసంగాలకే పరిమితమవుతున్నారని దేశ ప్రజలు అంటున్నారు.

ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట పరిసర ప్రాంతాలలో పదివేల మంది పోలీస్ పారా మిలిటరీ సిబ్బందితోపాటు ఆర్మీ , సిఆర్పిఎఫ్ , రాపిడ్ యాక్షన్ ఫోర్స్ , బిఎస్ఎఫ్ బలగాలు ఇప్పటికే ఢిల్లీని చుట్టూ ముట్టాయి.

ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉగ్రవాదుల ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతను కట్టు దిట్టం చేశారు.

ఢిల్లీ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నగరంలో పలుచోట్ల భారీ పోలీసు స్పందన బస్సులు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా అవకాశం రావడం ఆయన ప్రసంగం కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో కళాశాలలో.

ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ కార్యాలయాలు.

రంగురంగుల దిద్దిపాలతో మువ్వన్నెల జెండాలతో ముస్తాబయ్యాయి.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ఇక్కడ చూసిన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.