AP లో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు
అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. పేద వారికి 5 రూపాయలకే భోజనం, టిఫిన్ పెట్టనున్నారు.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లను ఆయా నియోజవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 5 నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రేపు గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఫుడ్ మెను, టైమ్ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.అన్న క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది.
బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా 5 రూపాయలే. బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 7.30 నుంచి 10 గంటలకు ఉం టుంది. లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటలకు ఉంటుంది. డిన్నర్ రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది.
ఆదివారం అన్న క్యాంటీన్లకు సెలవు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ పెడతారు. భోజనంలో కూర, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు వడిస్తారు. వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ ఉంటుంది.