20 బిలియన్ డాలర్లు విలువైన ఆయుధ విక్రయాల ఒప్పందానికి యూఎస్‌ ఆమోదం

20 బిలియన్ డాలర్లు విలువైన ఆయుధ విక్రయాల ఒప్పందానికి యూఎస్‌ ఆమోదం…

అందులో అనేక ఫైటర్ జెట్లు, 50పైగా ఎఫ్-15 ఫైటర్ జెట్స్, అధిక పేలుడు మోర్టార్లు.

ఈ మేర‌కు అమెరికా విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటన.

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ తాజాగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు 20 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ విక్రయాల ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. అందులో అనేక ఫైటర్ జెట్లు, 50పైగా ఎఫ్-15 ఫైటర్ జెట్స్, అధునాతన ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, 120 ఎంఎం ట్యాంక్ మందుగుండు సామగ్రి, అధిక పేలుడు మోర్టార్లు ఉన్నాయి. ఈ మేర‌కు అమెరికా విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటన విడుద‌ల చేసింది.

అయితే, ఈ ఆయుధాలన్నీ ఎప్పుడు ఇజ్రాయెల్ కు చేరుకుంటాయనేది తెలియలేదు. వీటన్నింటినీ ఇజ్రాయెల్ కు అప్పగించడానికి కొన్నేళ్లు పట్టనున్నట్లు సమాచారం. అమెరికా ఇవ్వనున్న ఈ ఆయుధాలు ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యాన్ని దీర్ఘకాలికంగా పెంచుకోవడానికి సాయపడ‌నుంది.

కాగా, ఇజ్రాయెల్ పై ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్న ఇరాన్‌, దాడికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆయుధ విక్రయ ఒప్పందానికి యూఎస్‌ ఆమోదించడం గమనార్హం