ఖమ్మం జిల్లా వేదికగా రైతులకు నేడు 2లక్షల రుణమాఫీ

ఖమ్మం జిల్లా వేదికగా రైతులకు నేడు 2లక్షల రుణమాఫీ

హైదరాబాద్ :

తెలంగాణ ఎన్నికల హామీ లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2లక్షల రుణమాఫీ నేటితో పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల మందికి పైగా రైతులకు రుణ విముక్తు లను చేసేందుకు రూ .31వేల కోట్ల రూపాయలు సర్కార్ కేటాయించింది. లక్ష వరకు రుణం ఉన్న రైతుల కు జులై 18 వ తేదీన రూ. 6034కోట్లు రిలీజ్ చేసింది.

లక్ష నుంచి లక్షన్నరలోపు రుణాలు ఉన్న 6లక్షల 40వేల 823 మంది రైతుల ఖాతాలో జులై 30న 6190 కోట్లను జమ చేసింది. లక్షన్నర నుంచి 2లక్షల వరకు లోను ఉన్న రైతులకు నేడు రుణమాఫీ ప్రక్రియ పూర్తి అవుతుంది.

మూడో విడత లక్షన్నర నుంచి 2లక్షల వరకు రుణమాఫీ నేడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లాంఛ నంగా పూర్తి చేస్తారు. ఖమ్మం జిల్లా వైరాలో జరగ నున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రుణమాఫీని ప్రకటించనున్నారు.

ఆ వెంటనే రైతుల అకౌంట్లో కి మాఫీ సొమ్మును జమ చేయనున్నారు.సీఎంపాల్గొ నే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తు న్నారు. రూ. 50వేల మందికి పైగా జనసమీకరణ చేస్తుండగా సభను రైతు పండుగలా నిర్వహించ నున్నారు.

అటు ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 9లక్షల 20వేల ఎకరాల ఆయకట్టుకు గోదా వరి జలాలు అందించడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టు డిజైన్ చేశారు. మూడు పంప్ హౌస్‌ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ట్రయల్ రన్ పూర్తయ్యింది.

ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమలాపుర్ పంప్‌హౌస్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు తొలిపంప్ హౌస్‌ను జిల్లా ఇంఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ప్రారంభిం చనున్నారు.

గోదావరి జలాలను కృష్ణమ్మ ఒడికి చేరుస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని..మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో రూ. 2 లక్షలకు మించి క్రాప్ లోన్స్ ఉన్న రైతులను పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్లు తెరపైకి రావడం తెలిసిందే. కౌలు రైతుల అప్పులు కూడా మాఫీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.