రాఖీ పండగకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 10 మంది మృతి…?

రాఖీ పండగకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 10 మంది మృతి…?

ఉత్తర్ ప్రదేశ్ :

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులంద్‌షహర్ జిల్లా సాలెంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బదౌన్ – మీరట్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, మరో మ్యాక్స్ ట్రక్కు వాహనం ఎదురెదురుగా వేగంగా వచ్చి ఒకదానినొ కటి బలంగా ఢీకొన్నాయి.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న వాహనా న్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసు కుంది. ప్రస్తుతానికి అందు తున్న ప్రాథమిక సమాచా రం ప్రకారం ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది దుర్మర ణం చెందగా మరో 27 మంది తీవ్రంగా గాయపడి నట్టు తెలుస్తోంది.

క్షతగాత్రులలో కొంతమంది ని అక్కడికి సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్న వారిని మీరట్ ఆస్పత్రికి తరలించారు.

మ్యాక్స్ వాహనంలో ప్రయా ణిస్తున్న వారు ఘాజియా బాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోన్న ఉద్యోగులుగా తెలుస్తోంది. వీరంతా రాఖీ పండగ కోసం అలీఘడ్ సమీపంలోని తమ సొంత ఊర్లకు వెళ్లేందుకని బయల్దేరి వస్తున్న క్రమంలోనే ఊహించని విధంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

తెల్లవారితే రక్షా బంధన్ వేడుకలతో కళకళలాడా ల్సిన వారి ఇళ్లలో ఈ అనుకోని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తమ సోదరులు పండగ కోసం ఇంటికి వస్తున్నారని ఆశగా ఎదురుచూస్తోన్న ఆ అక్కాచెల్లెళ్ల ఆశలను చిదిమేస్తూ వారి కడచూపు కోసం వేచిచూసేలా చేసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బులంద్ శహర్ జిల్లా కలెక్టర్ ప్రకాశ్ సింగ్, ఎస్ఎస్పీ, ఇతర ఉన్నతాధి కారులు హూటాహూటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు ఘటనా స్థలంలో పరిస్థితిని స్వయంగా సమీక్షించాల్సిం దిగా సూచిస్తూ ఆయన జారీచేసిన ఆదేశాల మేరకు తాను అక్కడికి వచ్చినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయం లో మ్యాక్స్ వాహనంలో 20 నుండి 22 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వారిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది…