ED కార్యాలయం ఎదుట నేడు కాంగ్రెస్ నిరసన

ED కార్యాలయం ఎదుట నేడు కాంగ్రెస్ నిరసన

హైదరాబాద్ :

కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుని కొందరికే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విధానా లకు నిరసనగా ఈరోజు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపనున్నారు

దేశంలోని అన్ని ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఆందోళనలు చేపట్టనున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాస్కీగౌడ్‌ తెలిపారు.

అంబానీ, అదానీ వంటి బడా వ్యాపారుల మద్దతు తోనే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. విజయవాడ లోని ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ అదానీ కోసమే పనిచేస్తున్నారు. సెబీ- హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలి’ అని మధుయాస్కీ డిమాండ్‌ చేశారు….