తెరమీద హీరో – నిజ జీవితంలో…?

తెరమీద హీరో – నిజ జీవితంలో…?

మూగ జీవాల మీద ప్రేమ చూపిస్తూ సేవ చేసే బ్లూ క్రాస్ అమలగా కొన్ని సార్లు మీడియాలలో పేరు. తెరమీద హీరోయిన్. నిజజీవితంలో హీరో నాగార్జునకు రెండో భార్య. అమల కూడా నాగార్జునతో పాటుగా ఎన్ కన్వెన్షన్ భాగస్వామి.

తాజా వార్త :

అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్న హైడ్రా. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్. ఎన్ కన్వెన్షన్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే రహదారి మూసివేత. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదు. తమ్మిడి చెరువులో మూడు ఎకరాలకు పైగా ఆక్రమించారని ఫిర్యాదు. తమ్మిడి చెరువు పరిశీలించి హైడ్రా కూల్చివేతలు.//

అక్కినేని నాగేశ్వర రావు హీరో. తరువాత రెండో తరంలో నాగార్జున హీరో. ఎన్నో సినిమాలు చేశారు. నాన్న హయాంలో అన్నపూర్ణ స్టుడియో పెట్టారు. ఎన్నో ఆస్తులు సంపాదించారు. ఇంతవరకు బావుంది.

నాగార్జున వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడేవారు. తరువాత వైఎస్ జగన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడేవారు. గత జగన్ హయాంలో స్వయంగా సినీపరిశ్రమ నుండి కూడా వచ్చి కలిసి వెళ్లారు. వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డతో వ్యాపార భాగస్వామ్యం. ఆయన జైల్లో వుంటే అక్కడ కూడా కలిసి వచ్చేవారు నాగార్జున. వ్యాపారంలో కొన్ని ఉల్లంఘనలు సహజం. మరీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భయపెడితే భయపడేంత ఆక్రమణలు అనేది నిజం. వారితో అంటకాగి చేసిన వ్యాపారాలు మద్దతు తరువాత జరిగిన పరిణామాలు.

తప్పు ఎప్పటికైనా తప్పే. అన్ని సార్లూ మనలను చూసే చూడనట్లు వెళ్లే రాజకీయన నాయకులు వుండరు. ఒక్కోసారి న్యాయస్థానాలు జోక్యం చేసుకొని జాడిస్తాయి అక్రమార్కులపై.

వెరసి కొన్ని దశాబ్దాల పేరు ప్రఖ్యాతులు నేలపాలు. నిజజీవితంలో ఆక్రమణదారులు అనే పేరు. ఎంత సంపద వుండి ఏమి ప్రయోజనం? ఏమి చేసుకొంటారు అదంతా. విడాకులు, మళ్లీ కోడలు. గాడిన పడని మూడో తరం నటన. ప్రేక్షకాదరణ లేని పేలవ నటన ఈ తరంలో.

జ్యోతిష్కుడి ముసుగులో ఆఫ్ట్రాల్ వేను స్వామి లాంటి వారు కూడా కొడుకు పెల్లప్పుడే మళ్లీ విడిపోతాడు అనే కారు కూతలు. నో వన్ కేర్స్. పాపం వెంటాడుతోందా అంటే కర్మ ఎవరినీ వదలదు.

రాజదాసులా అప్పటి కాంగ్రెస్స్‌లో రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేసినా.. నేటి అదే కాంగ్రెస్స్ పాలనలో నేలమట్టం అవుతోంది చేసిన పాపం. ఇది దేవుడి స్క్రిప్ట్ కాదు. దిగజారినా.. పాపం, కర్మ వదలదు అనేదానికి ఒక ఉదాహరణ.

లోటస్ పాండ్ వద్ద, జగన్ రెడ్డి రోడ్డును ఆక్రమించి కట్టిన షెడ్ కూల్చేస్తే.. ఇదే రేవంత్ రెడ్డి సదరు అధికారిని సస్పెండ్ చేయడం గమనార్హం.