గద్దర్ అవార్డ్స్… గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

గద్దర్ అవార్డ్స్… గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను మొదలుపెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి..

అయితే ఇప్పుడు తాజాగా గద్దర్ అవార్డుల పేరుతో లోగోను రూపొందించేందుకు పలువురు ప్రముఖులతో ఒక ప్రత్యేకమైన కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిందట.

గద్దర్ అవార్డుల కమిటీకి చైర్మన్గా బి నరసింహారావు, నిర్మాత దిల్ రాజును వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. కమిటీకి సలహాదారునిగా రాఘవేంద్రరావుని తమ్మారెడ్డి భరద్వాజ్ ని ,అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, దగ్గుబాటి సురేష్ బాబు, ఆర్ నారాయణ మూర్తి చంద్రబోస్ తదితరులు కన్వీనర్గా కమిటీని ఏర్పాటు చేస్తూ పలు రకాల ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. FDC కమిటీతో చర్చించి ఆ తరువాత తదుపరి కార్యశరణను సైతం మొదలుపెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామంటూ ప్రకటించిన తర్వాత ఎవరు కూడా తనను సంప్రదించలేదంటూ ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్స్ చేయడం జరిగింది.

అందుకే తెలుగు ఫిలిం చాంబర్స్ ప్రొడ్యూసర్ కౌన్సిలర్స్ సైతం రంగంలోకి దిగి మరి.. గద్దర్ అవార్డుల పేరు పైన నివేదికను అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు సెలబ్రెటీలకు నంది అవార్డు ఇస్తూ ఉండేవారు. 2014 తర్వాత వీటిని ఎవరూ పట్టించు కోలేదు. గతంలో ఎంతో మందిని ప్రకటించిన వీటికి సంబంధించి కార్యచరణ తీసుకోలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడానికి నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని గద్దర్ జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలిపారు. మరి ఈ అవార్డుల తేదీకి సంబంధించి అధికారికంగా తేదీని ప్రకటిస్తారేమో చూడాలి..