హైడ్రా రిపోర్ట్… 18 చోట్ల కూల్చివేతలు… 43 ఎకరాలు స్వాధీనం

హైడ్రా రిపోర్ట్… 18 చోట్ల కూల్చివేతలు… 43 ఎకరాలు స్వాధీనం..

ఇప్పటివరకు హైదరాబాద్ లో 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. 43.94 ఎకరాల అక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ, లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, అమీర్పేట్లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్ కట్టడాలను కూల్చివేసినట్లుగా హైడ్రా రిపోర్ట్ లో పేర్కొంది.

నంది నగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జాకార నుంచి కాపాడిన హైడ్రా.

లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని కాపాడిన హైడ్రా.

మనసురాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేత.

ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత.

మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా.

బిజెఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రా.

గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత.

గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రములను చేసిన బోనాలు కూల్చివేత.

బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత.

చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా.

నందగిరి హిల్స్లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత.

నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు.

రాజేంద్రనగర్ చెరువులు కబ్జాలు కూల్చివేత.

ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేత.

ఎంఐఎం ఎమ్మెల్సీ సి మిర్జా బేగ్ నిర్మించిన రెండంతస్తుల భవనం కూల్చివేత.

చందానగర్ ఏర్ల చెరువులో కబ్జాలు కూల్చివేత.

ప్రగతి నగర్ ఎర్రగుంట లో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేత.

బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలు కూల్చివేత.

గండిపేట చెరువులో నిర్మించిన ఫామోజులు కూల్చివేత.

మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సంబంధించిన ఒరో స్పోర్ట్ కూల్చివేత.

టీటీడీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్ యజమాని ఫామ్ హౌస్ కూల్చివేత.

బిజెపి నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేత.

ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూల్చివేత.

మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.

166 అక్రమ నిర్మాణాలు కూల్చివేత.