రేపటి నుంచి రుణమాఫీ సర్వే

రేపటి నుంచి రుణమాఫీ సర్వే

హైదరాబాద్ :

రుణమాఫీకాని రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అర్హలై ఉండి ఇతర కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకోనున్నారు.

దీనికోసం ప్రత్యేకంగా రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ ను రాష్ట్ర వ్యవ సాయ శాఖ పొందించింది. ఈ యాప్ ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయాధి కారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధి కారులకు పంపించారు.

రుణమాఫి వర్తించని వారి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్ లో స్థానిక పంచా యతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని,సూచించింది.

ఈ యాప్ ను ప్రయోగా త్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని అధికారు లను ఆదేశించింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్ లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.

రూ. 2లక్షల వరకు రుణ మాఫీ చేసినా తమకు మాపీ కాలేదని రైతులు వ్యవసా యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి అకౌంట్లను చెక్ చేసిన ప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తెలిపాయి.

రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ ను రూపొంది స్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగు ణంగా యాప్ ను అందు బాటులోకి తీసుకువచ్చి నట్లు అధికారులు తెలిపారు.