రూల్స్ బ్రేక్ చేస్తున్న ఏ హాస్పిటల్‌ను వదలొద్దు… మంత్రి దామోదర రాజనర్సింహ.
డెంగ్యూ పేరిట దోపిడీ ఎక్కువైందని, డైలీ ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
రూల్స్ బ్రేక్ చేస్తున్న ఏ హాస్పిటల్‌ను వదలొద్దని స్పష్టం చేశారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి డెంగీ దోడిపీని నియంత్రించాలని, పేషెంట్లు ఫిర్యాదు చేసేందుకు కూడా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వాస్తవ పరిస్థితులను గుర్తించాలన్నారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.