CM స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం
వక్రబుద్ది ఉంటే అన్ని వంకరగా కనిపిస్తాయి.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా…?
సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది
కవిత బెయిల్ విషయంలో న్యాయం,ధర్మం గెలిచింది.. ఈడీ,సీబీఐ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా…?
కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9 లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారు.. తుక్కుగూడలో 25 ఎకరాలు సర్వే నంబర్ 895 లో పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారు.. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న తమ్ముళ్ల పి.ఏ ల పేరు మీద భూములు కొంటున్నారు
సీఎం రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గింది.. రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డి.కె.అరుణను గెలిపించారు.. మోడీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారు
రుణమాఫీపై మేము రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండి ఎందుకు.. ప్రజల కోసం పోరాడే బాధ్యతను ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు – మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు