రైతుల ఆదాయం పెంచేందుకు 14 వేల కోట్లతో ఏడు కొత్త పథకాలు…!!
కేంద్ర క్యాబినెట్ లో ఆమోదం!!
నాగర్ కర్నూల్ :
వ్యవసాయం దాని అనుబంధ రంగాల సమాగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 14 వేల కోట్ల రూపాయలతో ఏడు కొత్త భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది సోమవారం జరిగిన కేంద్రం క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ రంగానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదించింది.
ఇందులో 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, 3979 కోట్లతో క్రాఫ్ సైన్స్ పథకాలు ఉన్నాయి.
రైతులు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు పరిశోధన అధ్యయనం వ్యవసాయ రంగా డిజిటలైజేషన్ తోపాటు ఉద్యాన పంటలు.
పాడి పరిశ్రమ అభివృద్ధిపై ఈ కార్యక్రమాల ద్వారా ప్రధానంగా కేంద్రీకరిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
2047 సంవత్సర నాటికి వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా రైతులను సిద్ధం చేసేందుకు ఆహార భద్రతను సాధించేందుకు ఆరు కీలక అంశాలలో పరిశోధన అధ్యయనం నూనె గింజలు.
పంటల అభివృద్ధి, వాణిజ్య పంటలు మెరుగుపరచడం చీడ పీడల పై పరిశోధనలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
వ్యవసాయ విద్యారంగానికి బలోపేతం చేసేందుకు నిర్వహణ సోషల్ సైన్స్ కోసం 2,291 కోట్లు ను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2020 నూతన విద్యా విధానానికి అనుగుణంగా వ్యవసాయ పరిశోధన విద్యను ఆధునికరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇందుకోసం 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఇందులో అగ్రీ స్టాకు, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టం అనే రెండు కీలకంశాలు ఉన్నాయి.
పశుసంపద ఆరోగ్యం వాటి ఉత్పత్తి 1702 కోట్లతో మరో కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఉద్యానవ పంటల అభివృద్ధికి 860 కోట్లను కేటాయించింది.
కృషి విజ్ఞాన కేంద్రాల అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా 700 పై చిలుకు కృషి విజ్ఞాన కేంద్రం అభివృద్ధి కోసం మరో 1202 కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ నిర్మాణ కోసం 1115 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది కానీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఇప్పటికే పీఎం కిసాన్ సమాన్ నిధి ఆర్థిక సహాయం 2000 నుంచి పెంచకుండా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తూ కాలయాపన చేస్తుందని విమర్శలు వస్తున్నాయి.
డిజిటల్ ఇండియా పేరుతో ప్రపంచ దేశాలలో అగ్రగామిగా మన దేశం ముందంజలో ఉందంటూ ప్రసంగాలు చేయడం తప్ప దేశంలోని అత్యంత వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తుందని ఇప్పటికే ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమం కూడా 2047 సంవత్సరం నాటికి ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అభివృద్ధి చెందిన దేశంగా చూపిస్తామని ప్రసంగాలు చేయడం తప్ప ఆనాటి వరకు ఈ దేశం లో తిండి గింజలు పేదరికం కటిక దారిద్రం రూపుమాపడం ఎందుకు సాధ్యం కాదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కేవలం కాలయాపనతో కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ప్రధానంగా రైతాంగం నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్యం వహిస్తుందని ఇప్పటికైనా రైతుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేసి నిధులు విడుదల చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.