బీ-అలెర్ట్… భారీగా పెరగనున్న కూరగాయల ధరలు…!! ఇప్పుడే తెచ్చి పెట్టుకోండి…!!!

బీ-అలెర్ట్… భారీగా పెరగనున్న కూరగాయల ధరలు…!! ఇప్పుడే తెచ్చి పెట్టుకోండి…!!!

గతకొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి.

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండ కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి.

దీంతో చాలా జాతీయ రహదారులు నదులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగియి. ఇలాంటి నేపథ్యంలోనే సామాన్య ప్రజలు ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. త్వరలో కూరగాయల ధరలు భారీగా పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం కూరగాయల ధరలే భారీగా ఉన్నాయి. వాటిని కొనలేక సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఏ రకం కూరగాయాలను చూసిన ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కూరగాయల ధరలకే తట్టుకోలేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో త్వరలో ఇంకాస్తా పెరుగుతాయనే వార్తలు బయటకు వస్తున్నాయి. గతకొన్ని రోజులుగా కురుస్తున్నవానలకు భారీగా పంట నష్టం జరిగింది. చేతికి వచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. దీంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో కురిసిన వానలకు కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. అలానే మార్కెట్లకు రావాల్సిన కూరగాయల వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

దీంతో మార్కెట్లో కి రావాల్సిన కూరగాయలు ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కూరగాయల నిల్వలు తగ్గిపోయి.. రాబోయే రోజుల్లో సప్లయ్ బాగా పడిపోతే..ధరలు అమాంతం పెరగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యవసర వస్తువులు, కూరగాయాలు వంటి వాటిధర భారీగానే ఉండగా.. త్వరలో మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైన వరకు కూరగాయలను ముందుగా సేకరించుకుంటే ఉత్తమమని పలువురు అభిప్రాయాపడుతున్నారు. వరదల సాకుగా చూపి..వ్యాపారస్తులు కూడా కూరగాయల ధరలు అమాంత పెంచేస్తారని పలువురు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి..రానున్న రోజుల్లో కూరగాయల ధరలు పెరగనున్నాయనే నేపథ్యంలో సామాన్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండ కారణంగా దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వానలు కురిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలపై పగబట్టినట్లు వరుణుడు తీవ్ర స్థాయిలో విజృంభించాడు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ , హైదరాబాద్ లో వానలు దంచికొట్టాయి. అలానే ఏపీ లో చూసినట్లు అయితే కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఓ రేంజ్ లో విరుచుకపడ్డాడు. గత శని, ఆదివారం కురిసిన వానలకు విజయవాడ సముద్రాన్ని తలపించింది. అంతేకాక అనేక రైలు, రోడ్డు మార్గాలు వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తంగా ఈ వరదల ప్రభావంతో రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మండిపోనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.