సివిల్ సప్లైలో అవకతవకలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం… హైకోర్ట్ లో పిల్ దాఖలు చేసిన BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి..
పక్కా ఆదారాలతో పిల్ దాఖలు..విచారణ చేపట్టిన హైకోర్ట్ చీఫ్ జస్టిస్ దర్మాసనం..
నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అదికారులకు ఆదేశించిన హైకోర్టు..
బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నా బిడ్డర్ల కాలపరిమితి పొడిగించడం ప్రభుత్వమే అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్టన్న బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి..
-కదులుతున్న డొంక.1100 కోట్ల ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల పాలు..
వివరాల్లోకి వెలితే….
కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ సివిల్ సప్లై కార్పోరేషన్ లో బారీ స్కామ్..
టెండర్ విలువ కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని,తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజనా ఖాలీ అవుతుందని హైకోర్ట్ లో పిల్ (ప్రజాప్రయోజన వాజ్యం) దాఖలు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
పిల్ నంబర్ 34/24..
తెలంగాణా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గారి ముందు ఈ రోజు పిల్ విచారణకు వచ్చింది..
పిల్ సందర్బంగా వాదనలు విన్న దర్మాసనం అందులో భాద్యులుగా చేర్చిన అందరికి నోటీసులు జారీ చేయండని ఆదేశాలిచ్చింది..
నాలుగు వారాల సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని దర్మాసనం తెలిపింది..
క్వింటాల్ కు 2007 రూపాయలకు టెండర్ వేసి,రాష్ట్రప్రభుత్వానికి 2007 రూపాయలే డబ్బులు చెల్లిస్తూ దాన్యం వేసిన బిడ్డర్స్ నాలుగు ఏజెన్సీలు మిల్లర్ల దగ్గర ఉన్న దాన్యం ఎత్తకుండా,బ్యాంకు ఎకౌంట్ లద్వారా 2230 రూపాయలు వసూలు చేస్తున్నారు..
అందుకు సంబందించిన పూర్తి ఆదారాలు ఫిల్ లో దాఖలు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి..
క్వింటాల్ కు 223,ఒక టన్నుకు 2230 రూపాయలు అందనంగా వసూల్ చేస్తున్న ఎజెన్సీలు.
38 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం టెండర్ పద్దతిలో ప్రభుత్వం ఈ నాలుగు ఏజెన్సీలకు కట్టబెట్టింది.
ప్రభుత్వం,ఏజెన్సీ మద్య జరిగిన టెండర్ అగ్రిమెంట్ పొందుపరిచిన టర్మ్స్ & కండిషన్స్ లో కూడా 874 కోట్ల వాయిలషన్స్ జరిగాయి..
అందులో ముఖ్యంగా దాన్యం ఎత్తకుండానే మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు..
అదనపు డబ్బులు బిడ్డర్ తీసుకుని టెండర్ డబ్బులు మాత్రమే సివిల్ సప్లై కార్పోరేషన్ కు చెల్లిస్తున్నారు.
మిల్లర్లు దగ్గర డబ్బులు వసూలు చేసిన తర్వాతనే దాన్యం రిలీజింగ్ ఆర్డర్ ప్రభుత్వం ఇస్తుంది..
దాన్యం ఎత్తకపోవడం ద్వారా మార్కెట్ ఫీజ్ ప్రభుత్వం నష్టపోతుంది..మార్కెట్ ఫీజ్ సైతం టెండర్ పొందిన ఏజెన్సీ కట్టాలని రూల్ ఉంది..హమాలీ చార్జెస్,ట్రాన్స్ పోర్ట్ చార్జీలు సైతం సంబందిత ఏజెన్సీలకు మిగులుతున్నాయి..
దాన్యం ఎత్తకుండా కేవలం డబ్బుల తతంగమే నడవటం అది పూర్తి చట్ట విరుద్దం.
బిడ్డర్ ప్రభుత్వానికి మద్య అగ్రిమెంట్ లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించిన అనంతరమే దాన్యం విడుదల ఆర్డర్, దాన్యాన్ని లిప్ట్ చేయాలని స్పష్టంగా ఉంది..
బిడ్డర్ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా పూర్తి చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ రాతపూర్వకంగా పిర్యాదు చేసింది..
అయినప్పటికి ప్రభుత్వం, అదికారులు వారికున్న 90 రోజుల వాలిడిటి పిరియడ్ లోపే పిర్యాదు చేసినప్పటికి అదికారులు,ప్రభుత్వం పట్టించుకోలేదు..
ఈ వ్యవహారంలో పెద్దల హస్తం ఉందని,టెండర్ కాలపరిమితి ముగిసినా మళ్ళి వారికే రెండు కాలపరిమితిని పెంచడం నిబందనలకు విరుద్దం..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దీని వెనక పెద్దలు ఉన్నారని అర్థం అవుతుంది.
టెండర్లకు విరుద్దంగా అక్రమ వసూళ్ళు,ఇటివల సన్నబియ్యం టెండర్లలో నిర్ణయించిన దర ఇవన్నీ బేరిజు వేసుకుంటే దాదాపు 1100 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తుంది..
అదనపు వసూళ్ళు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు వస్తున్నయ్..
ప్రెవేటుగా వసూలు చేసిన సొమ్ము ప్రభుత్వానికే రావాలి,సివిల్ సప్లై కార్పోరేషన్ కు చెందాలని,కార్పోరేషన్ నిలబడాలని ,భవిష్యత్ లో రైతులకు మద్దతు దరను చెల్లించే శక్తి కార్పోరేషన్ కోల్పోకూడదని అలా జరగాలంటే ఇలాంటి నష్టాలను,ఆక్రమనలను అరికట్టాలని,వసూలైన డబ్బులను కార్పోరేషన్ కు వచ్చే విదంగా ఆదేశాలివ్వాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ ను ఆశ్రయించిన బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి..
పెద్ది సుదర్శన్ రెడ్డి వేసిన ఫిల్ పై వాదనలు విన్న దర్మాసనం,నాలుగు వారాల్లో సమాదానం చెప్పాలని,కౌంటర్ దాఖలు చేయాలని సంబందిత అదికారులకు కోర్టు ఆదేశించింది..