ప్రయత్నం బెడిసి కొట్టింది… పోలీసులకు దొరికిపోయారు

ప్రయత్నం బెడిసి కొట్టింది… పోలీసులకు దొరికిపోయారు

నకిలీ బంగారాన్ని ఒరిజినల్ బంగారంగా అమ్మాలనే ఉద్దేశం

చాకచక్యంగా ముగ్గురు నేరస్తులను పట్టుకుని రిమాండ్ కు తరలించిన షాద్నగర్ పోలీసులు

నకిలీ బంగారం అడ్డాగా బళ్ళారి

అమాయకులైన ప్రజలను నకిలీ బంగారాన్ని ఒరిజినల్ బంగారంగా అమ్మ జూపాలనే ప్రయత్నంతో మోసం చేయాలనుకున్న ముగ్గురు నిందితులను షాద్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

షాద్ నగర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బలరాం తెలిపిన వివరాల ప్రకారం…..

కడ వెండి గ్రామం, దేవ్ రూపుల మండలం, జనగామ జిల్లాకు చెందిన (A1) భాషాపక సుజీత్ @ సంతోష్ @ రంజిత్, మైత్తరం గ్రామం, పాలకుర్తి మండలం, జనగామ జిల్లాకు చెందిన (A2) పలనాటి అశోక్, దేవ్ రుపుల గ్రామం మరియు మండలం, జనగామ జిల్లాకు చెందిన (A3) భాషపాక రమేష్ లు ముగ్గురు కలిసి బళ్లారిలో మహేష్ అనే వ్యక్తి దగ్గర నకిలీ బంగారం అని తెలిసి కూడా అట్టి బంగారం కొని అట్టి నకిలీ బంగారం ను ఒరిజినల్ బంగారంగా చెప్పి ప్రజలని మోసం చేసి ఎక్కువ ధరకు అమ్ముకొని ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో నకిలీ బంగారం ను హైద్రాబాద్ తరలిస్తుండగా పై నేరానికి పాల్పడిన ముగ్గురు నేరస్తులను షాద్ నగర్ పోలీసు వారు నిన్న తేదీ: 05.09.2024 నాడు రాయికల్ టోల్ ప్లాజా దగ్గర పట్టుకుని అరెస్ట్ చేసారు.

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్ నగర్ పోలీసులు క్రైం.నెం. 686 /2024, U/s 318(4), 3(5)BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పై తెలిపిన ముగ్గురు నిందితుల నుండి 790 గ్రాముల నకిలీ బంగారం, స్విఫ్ట్ డిజైర్ కార్, 3 మూడు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించారు. నేరస్తులను పట్టుకోవడం చాకచక్యంగా వ్యవహరించిన ఈ కేసులో ఏసీపీ రంగస్వామి పాల్గొని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. విజయ్ కుమార్ ను, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శరత్ కుమార్ ను మరియు అతని టీం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ బలరాం లను అభినందించారు.