హర్యానా ఎన్నికల వేళ BJPకి తలనొప్పి
Haryana election is a headache for BJP– మొదట కంగనా…ఇపుడు బ్రిజ్ భూషణ్ వంతు
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కథ ముగిసిందనుకునేలోపు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పి పెరిగింది. ఒకపక్క పార్టీలోని అసంతృప్తి, మరోవైపు పార్టీలోని నేతలు సున్నితమైన అంశాలపై నోటికి వచ్చినట్టు మాట్లాడటంతో.. ఆ పార్టీకి మరింత నష్టాన్ని తెచ్చిపెడుతోంది.
దీంతో బీజేపీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. తొలుత హర్యానా ప్రజలుకు సెంటిమెంట్‌గా ఉన్న రైతు ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది. అసలే బీజేపీపై గుర్రుగా ఉన్న రైతాంగానికి పుండుమీద కారం చల్లినట్టు అయింది.
కంగనా వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలమైన హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బలమైన రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు పంజాబ్, హర్యానా బీజేపీ నేతలు కూడా కంగనా వ్యాఖ్యలను ఖండించారు. దీంతో ఆ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. వెంటనే బీజేపీ జాతీయ నాయకత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, కంగనా రనౌత్‌ను ఢిల్లీకి పిలిచి.. ఇక విధాన పరమైన అంశాలపై మాట్లాడొద్దని నోటికి తాళం వేశారు.
తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది.
ఇటీవల రెజ్లర్లు వినేశ్ ఫొగట్, భజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీజేపీ నేత, డబ్ల్యుఎఫ్ఐ మాజీ అధ్యక్షులు బ్రిజ్ భూషన్ సింగ్ రెచ్చిపోతున్నాడు.
కాంగ్రెస్‌లో చేరిన తరువాత ఇద్దరు రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ సింగ్ లక్ష్యంగా చేసుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫొగట్‌కు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. దీంతో బ్రిజ్ భూషన్ సింగ్ గత రెండు రోజులుగా వినేశ్ ఫొగట్, పునియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బ్రిజ్ భూషన్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, భజరంగ్ పునియా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో బీజేపీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ నిరాకరించింది.
దీంతో వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వారిద్దరిపై నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే వినేశ్ ఫోగట్‌పై హర్యానాలో సానుభూతి ఉంది. ఆ హర్యానాలోని రైతు సంఘాలు, బలమైన జాట్ వర్గం ఆమెకు మద్దతుగా ఉంది. ఆమెపై బ్రిజ్ భూషణ్ చేసిన విమర్శలతో బీజేపీకి నష్టం జరగడంతో పాటు, మరోవైపు కాంగ్రెస్‌కు సానుకూలత పెరుగుతోందని ఆ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలాంటి పొరపాట్లు చేయకూడదని, పార్టీ నాయకుల వ్యవహారశైలితో ప్రతిపక్ష పార్టీలు లబ్ది పొందకుండా ఉండేందుకు బీజేపీ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా నడ్డా బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌ను పిలిపించి తలంటినట్టు సమాచారం. ఎన్నికల వేళ ఫోగట్, పునియాపై మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.
రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ విమర్శలు…
తనకు సంబంధంలేని ఆ మూడు ఘటనలకు తనను బాధ్యుడిని చేశారని, ఎప్పటికైనా సత్యం గెలుస్తుందని బ్రిజ్ భూషణ్ సింగ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను పాండవులతో పోల్చిన ఆయన, మహాభారత కాలంలో పాండవులు ద్రౌపదిని పణంగా పెట్టారన్నారు. ఇప్పటి వరకు పాండవులను దేశం క్షమించలేదన్నారు.. తాను ఇప్పటికీ మౌనంగా ఉండేవాడినని, కానీ సాక్షి మాలిక్ ఇప్పటికీ మహిళల కోసం పోరాడుతున్నాని చెప్పడం వలనే స్పందించాల్సి వచ్చిందని అన్నారు. ఫోగట్, పునియా కాంగ్రెస్‌లో చేరడం కోసం అవాస్తవాలను ప్రచారం చేశారన్నారు.
కొంతమంది స్వార్థ ప్రయోజనాల కారణంగా తన పరువు, ప్రతిష్టలతో పాటు రెజ్లింగ్‌కు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో కనీసం ఐదు పతకాలు సాధించేవాళ్లమని, కానీ కొందరి కారణంగా పతకాలు రాలేదని అన్నారు. వినేశ్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకే పతకం చేజారిందని విమర్శించారు. హర్యానా ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని బ్రిజ్ భూషణ్ సూచించారు. భజరంగ్ పునియా హర్యానాకు హీరో కాదని, విలన్ అంటూ విమర్శించారు.
నా ప్రతి అడుగులో నా వెంట ప్రజలే వినేశ్ ఫోగట్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై వినేశ్ ఫోగట్ తనదైన శైలిలో స్పందించారు. ఆమె ఆదివారం జులనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…