పార్టీ MLA కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

పార్టీ MLA కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుంది..

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి,రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి స్వయంగ ఎమ్మెల్యేల ఇంటికి చేరి కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతాడు…

పది మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు నుండి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతారు..

హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ లో భయం మొదలైంది.

ఫిరాయింపులపై స్పీకర్ ని కలిసి సుప్రీంకోర్టు తీర్పలను సైతం ఉటంకిస్తూ పిర్యాదు చేసినం..

దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసిందే కౌశిక్ రెడ్డి..

బీఆర్ఎస్ పార్టీ తరపున హైకోర్టు జస్టిస్ కి కృతజ్ఞతలు చెబుతున్న..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపడి చావు డప్పులు కొట్టండి అని మాట్లాడి0దే రేవంత్ రెడ్డి..

హైకోర్టు తీర్పు వచ్చిన రోజు అరికెపుడి గాంధీని pac చైర్మన్ గా నియమిస్తూ ప్రకటన చేశారు..