తొలి అరెస్టు ఎవరిదో…? అధికారులు, ఐపీఎస్‌ల చుట్టూ ఉచ్చు బిగించిన ప్రభుత్వం

తొలి అరెస్టు ఎవరిదో…? అధికారులు, ఐపీఎస్‌ల చుట్టూ ఉచ్చు బిగించిన ప్రభుత్వం…

మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపు 90 రోజులుగా బయట ప్రపంచానికి కనిపించకుండా తిరుగుతున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి జోగి రమేశ్‌, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్‌ కూడా అండర్‌ గ్రౌండ్‌కి వెళ్లిపోయారు.

ఇటు నేతలు.. అటు పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు.. అంతా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారే.. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేయగా, మరికొందరిపై కేసులు పెట్టేందుకు పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. మొత్తానికి అందరికీ శ్రీకృష్ణ జన్మస్థలం చూపించాలనేదే ప్లాన్‌. ఒకరి తర్వాత ఒకరిగా మొత్తం టార్గెట్‌లో ఉన్నవారందరికీ ఉచ్చు బిగించింది సర్కార్‌. ఇక నేడో రేపో యాక్షన్‌ ఉంటుందంటున్నారు. మరి తొలి అరెస్టు ఎవరిదో..? సీఐడీ, ఏసీబీ అధికారులు సంయుక్తంగా కొనసాగిస్తున్న వేటకు దొరికేది ఎవరు?