లైంగిక వేధింపులకు పాల్పడిన జానీ మాస్టర్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు
జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ
ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న రాయ దుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు.
చెన్నై, ముంబై, హైదరాబాద్లో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది.
ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఎఆరు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసును బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ పై గతంలోనూ ఒకేసు ఉంది 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ కోర్ట్ ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది తాజాగా మహిళ పొడవుగాపర్ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు బుక్ అయింది ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైన అతనిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మరి ఈ సంచలన ఆరోపణలపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.