హైదారాబాద్ లోన్ఆరోగ్య భద్రత కార్డు పై అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించిన ఆసుపత్రి సిబ్బంది

హైదారాబాద్ లోన్ఆరోగ్య భద్రత కార్డు పై అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించిన ఆసుపత్రి సిబ్బంది..

పోలీస్ ఆఫీసర్ మృతి

యూసఫ్‌గూడ 1వ బెటాలియన్లో పోలీసు అధికారి జనార్ధన్ శ్వాస సమస్యతో యశోద హాస్పిటల్స్ సోమాజీగూడకి తీసుకు వెళ్లారు.

ఎమర్జెన్సీ డాక్టర్లు వెంటనే స్పందించి చికిత్స ప్రారంభించారు 30 నిమిషాల తరువాత డాక్టర్లు మమ్మల్ని కౌన్సిలింగ్ రూమ్ లోకి పిలిచి పేషంట్ ని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది మీకు ఏమైనా ఇన్స్యూరెన్స్ ఉందా అని అడగారు.

వెంటనే అతను ARSI గా పనిచేస్తున్నారు ఆరోగ్య భద్రత వర్తిస్తుంది అని తెలియజేశారు అయితే వెంటనే డాక్టర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇక్కడ రూమ్స్ అందుబాటులో లేవు అని చెప్పారు.

అయిన పేషంట్ ఇప్పుడు స్టేబుల్ గానే ఉన్నాడు అని మాట మార్చి మీరు వెంటనే ఎమర్జెన్సీ నుండి తీసుకెళ్ళమని చెప్పారు.

అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు.

హెల్త్ కార్డ్ ఉన్నా తమకు తగిన గుర్తింపులేకుండా పోయిందని ఆవేదన చెందుతున్న పోలీస్ ఆఫీసర్ కుటుంబ సభ్యులు.

పోలీసు అరోగ్య భద్రత కార్డు పై చాలా ఆసుపత్రిలో సేవలు నిలిపివేయడం జరిగింది.

నెల నెల ఆరోగ్య భద్రత అమౌంట్ కట్ అవుతున్న కానీ మెజారిటీ ఆసుపత్రిలు సేవలు నిలివేశాయి.