తెలంగాణ భవన్లో మాజీ మంత్రి , MLA జి .జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్

తెలంగాణ భవన్లో మాజీ మంత్రి , MLA జి .జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్… తెలంగాణ భవన్

మూసీ పరివాహక ప్రాంతాల భాదితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్ పై దాడి చేశారు.

పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం ఈ దాడి జరిగింది.

ట్రాఫిక్ సిగ్నల్ ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు

కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు

బిఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు

మూడు నెలలుగా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపై కాంగ్రెస్ దాడులు చేస్తోంది

వరద భాదితులు, మూసీ నిర్వాసిత భాదితులను పరామర్శించేందుకు వెళ్లిన బిఆర్ఎస్ నేతలపై దాడులు చేశాయు.

ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామ స్థాయిలో బిఆర్ఎస్ నేతలపై దాడులు చేశారు

సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు.

ఖమ్మంలో వరద బాధితుల వద్దకు హరీష్ రావు,మేము వెళ్తే మాపై దాడి చేశారు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు

భయపెట్టి పాలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు

కేటీఆర్ కాన్వాయ్ పై జరిగిన దాడిపై విచారణ చేయాలి

డీజీపీ,హైదరాబాద్ సీపీ తమ సిన్సియారిటీని నిరూపించుకోవాలి

నర్సాపూర్ లో మా ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేశారు

మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయం

అధికారులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో మేము లిస్ట్ రెడీ చేస్తున్నాం

కాన్వాయ్ పై దాడి ఘటనలు చిల్లర వేషాలు,కుప్పిగంతులు

రేవంత్ రెడ్డి ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీతో వుండే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను స్పెషల్ పర్పస్ వెహికిల్ (spv)లా మార్చుకున్నారు

కాంగ్రెస్ పార్టీని పాత నాయకులు రక్షించుకోవాలి

తాను సీఎం కావడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకున్నారు

డీజీపీ,సీపీకి సోయి లేదా…?

ఖమ్మం పోలీస్ కమీషనర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పని చేస్తున్నారు

ఖమ్మంలో మాపై దాడి చేసి మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు

దాడులపై చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రక్షణ లేకపోతే ఎట్లా…?

మూసీ నదిని మురికి కూపంగా చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే

దమ్ముంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి మాట్లాడాలి

మూసీ ప్రణాళిక,డి.పి.ఆర్ ప్రభుత్వం వద్ద ఉందా…?

కాంగ్రెస్ ప్రభుత్వాలు పాడు చేసిన హుసేన్ సాగర్ ,మూసి లను కేసీఆర్ ప్రభుత్వం బాగు చేసింది

కాంగ్రెస్ మూసి ని మురికి గా మార్చింది .నల్గొండ కు ఫ్లోరిన్ అందించింది .గోదావరి కృష్ణా నీళ్లను కిందకు మళ్లించింది

ట్రీట్మెంట్ ప్లాంట్లతో మూసీ ,హుస్సేన్ సాగర్ ల నీళ్లను మురికి వాసన లేకుండా చేసింది కే టీ ఆర్ యే

కాంగ్రెస్ దాడులకు భయపడేది లేదు.

పోలీస్ కమిషనర్ ఆఫీస్ తెలంగాణ భవన్ పక్కనే ఉంది

తెలంగాణ భవన్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే కమిషనర్ ఏం చేస్తున్నట్టు ?ఎవరి మీద కేసులు పెట్టారు ?

పోలీసులు కాంగ్రెస్ దాడులను ఆపకపోతే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది

పోలీసులు మాకు రక్షణ కల్పించకపోతే మాకు ఏం చేయాలో తెలుసు

ఇకనైనా పోలీసులు తమ భాద్యతలను సక్రమంగా నిర్వర్తించాలి..