సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో ఇటీవల జరిగిన విధ్వంసం ఘటనకు బాధ్యులను చేస్తూ ముంబైకి చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మునవర్ జమా మరియు సికింద్రాబాద్ లో రెజిమెంటల్ బజార్‌లోని మెట్రోపాలిస్ హోటల్ ప్రొప్రైటర్ రెహ్మాన్, దాని మేనేజర్ అబ్దుల్ రషీద్ బషీర్ అహ్మద్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జమా ఇంగ్లీష్ హౌస్ అకాడమీ వ్యవస్థాపకుడు మరియూ మోటివేషనల్ స్పీకర్ అని ఇతని ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన వర్క్ షాప్ లో వ్యక్తిత్వ వికాసంపై నెల రోజులపాటు సెషన్ నిర్వహిస్తున్నారనే నెపంతో అందులో పాల్గొన్న వారిలో హిందువుల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.
హోటల్‌లో జరిగిన వర్క్‌షాప్‌కు హాజరైన 151 మందిలో విగ్రహం ధ్వంసం చేసిన సల్మాన్ సలీం ఠాకూర్ ఒకరు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. అక్టోబర్ 14న ఆలయంలోకి చొరబడి దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన సల్మాన్, దేశం నుండి పారిపోయిన జకీర్ నాయక్‌తో సహా ఇస్లామిక్ బోధకుల వీడియోలను చూసి ప్రేరణ పొందారు.
ఈ సల్మాన్ విగ్రహం ధ్వంసం చేసిన వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించేలోపే స్థానికులు కొట్టారు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వర్క్ షాప్ నిర్వహించిన జమా మరియు పాల్గొన్న సభ్యుల నేపథ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. “మేము కాన్ఫరెన్స్ రికార్డింగ్‌లు, పాల్గొనేవారికి పంపిణీ చేయబడిన మెటీరియల్ మరియు అనేక ఇతర వివరాలను కూడా పరిశీలిస్తున్నాము” అని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్ సిటీ పోలీసు అధికారి వెల్లడించారు. హోటల్‌లోని మొత్తం 49 గదులు హాజరైనవారి కోసం రిజర్వు చేయబడ్డాయి.
ముంబైలో ఉన్న మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా, మతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడంతోపాటు అల్లర్లు ప్రారంభించేలా ప్రజలను రెచ్చగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముత్యాలమ్మ గుడిలో ఉన్న దేవత విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేలా సల్మాన్‌ను రెచ్చగొట్టాడని గోపాలపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎల్ సురేష్ వెల్లడించారు. బషీర్ మరియు రెహ్మాన్ సహాయంతో జమా ఈ సెషన్‌ను నిర్వహించాడని, అయితే దానిని నిర్వహించడానికి అతనికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
ఈ మునావర్ జమా అనే వాడికి యూట్యూబ్‌లో 3.63 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్ లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 742K కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ మరియు ఫేస్‌బుక్‌లో దాదాపు 2.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.