మంత్రులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు… రేవంత్‎పై మంత్రులు కుట్ర పన్నుతున్నారని షాకింగ్ కామెంట్స్…!!

మంత్రులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు… రేవంత్‎పై మంత్రులు కుట్ర పన్నుతున్నారని షాకింగ్ కామెంట్స్!!

కరీంనగర్ :

కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం పీఠం నుంచి దించాలని కాంగ్రెస్ మంత్రులు చూస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గోతికాడ నక్కలా రేవంత్‎ను‎ దింపేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. హైడ్రా, మూసీ, గ్రూప్-1 విషయంలో జాగ్రత్త పడకపోతే.. రేవంత్ రెడ్డికు చిక్కులు తప్పవని బండి సంజయ్ అన్నారు.
జనంలో రేవంత్‎కు వ్యతిరేకత రావాలని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులే చూస్తున్నారని అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల మీద దాడులు చేయడం దారుణమని చెప్పారు. గ్రూప్-1 అభ్యర్థులు చేసిన తప్పేంటీ అని ప్రశ్నించారు. ప్రభుత్వం దుర్మార్గంగా, రాక్షసంగా వ్యవహారిస్తోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడం దారుణమని అన్నారు. ప్రభుత్వానిది చిల్లర నిర్ణయమని.. పేదల పొట్ట కొడుతారా అని బండి సంజయ్ మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని కోరారు. విద్యార్థుల బతుకులను నాశనం చేస్తారా అని నిలదీశారు. ‘రాత్రంతా లాటీ చేస్తారా, మీకు కేసీఆర్‎కు తేడా ఏంటీ’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి..60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామంటారా.. ఇంతకంటే సిగ్గు ఉంటుందా.. కేసీఆర్ దారిలోనే మీరూ వెళ్తారా.. కేసీఆర్, రేవంత్ రెడ్డి దొందూ దొందే..మాజీ మంత్రి కేటీఆర్‎కు కొంచెమన్నా సిగ్గుందా.. గ్రూప్-1 ఉద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫోజ్ ఇస్తున్నావా. 30 లక్షల నిరుద్యోగుల ఉసురు కేసీఆర్‎కే తగులుతుంది. కేసీఆర్, కేటీఆర్‎లను ఎవరూ నమ్మరు. నేనూ అశోక్ నగ‎ర్‎కు వెళ్తా. నిరుద్యోగుల కంటే నాకు కేంద్ర మంత్రి పదవి ఎక్కువ కాదు’’ అని బండి సంజయ్ అన్నారు..