మూసీకి రెండు పక్కలా కిలోమీటర్ దాకా పక్కా… సియోల్ పర్యటనలో తేల్చిన ఎంపీ, మంత్రులు…!!!
సియోల్ నగరంలో ఉన్న విధంగానే మన హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి నది ప్రవహిస్తుంది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఇంతకు ముందు ఇక్కడికి టూర్‌కు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మమ్మల్ని పంపించిండు.
చుంగ్ గై తరహాలో మూసీ ఇరువైపులా ఆకాశహర్మ్యాలు
ఆ నమూనా కావాలంటే బఫర్ జోన్ దాటి కూల్చాల్సిందే
పీపీపీతో ప్రైవేట్ కంపెనీలకు కాంగ్రెస్ సర్కార్ రెడ్‌కార్పెట్
చుంగ్ గై తరహాలో మూసీ ఇరువైపులా ఆకాశహర్మ్యాలు..
సియోల్ పర్యటనలో తేల్చిన ఎంపీ, మంత్రులు
ఇవీ.. దక్షిణ కొరియా సియోల్‌లో చుంగ్ గై చున్ వాగు పక్కన నిలబడి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సెలవిచ్చిన వివరాలు.. సియోల్ పర్యటనకు వెళ్లిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ సైతం ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తంచేశారు.
అంటే.. మూసీ ఇరువైపులా చుంగ్ గై చున్ వాగు పరిసరాల లెక్క మారుస్తారని సదరు మంత్రులు, ఎంపీ అధికారికంగానే చెప్పారు..మూసీ వెంట ఇంత పెద్ద ఆకాశహర్మ్యాలు రావాలంటే బఫర్‌జోన్ దాటి కిలోమీటర్ మేర విస్తరణ చేస్తారని మరోసారి చెప్పకనే చెప్పారు! ఇప్పటివరకు రేవంత్ సర్కారు బయటికి బఫర్‌జోన్ వరకు ఉన్న 10 వేల నిర్మాణాలనే కూల్చుతామని చెప్తున్నా.. ప్రజాసంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో నదికి రెండు వైపులా కిలోమీటర్ మేర అభివృద్ధి చేస్తామని పొందుపర్చారు. తాజాగా సియోల్ పర్యటనలో మంత్రులు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.
ఈ లెక్కన మూసీ రివర్బెడ్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను తొలగించి అందులోకి గోదావరి జలాలను ప్రవహింపజేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వమే మూసీ వెంట ఎలివేటెడ్ కారిడార్లు, రహదారులు, బ్రిడ్జిలు, మెట్రో రైలు నిర్మిస్తుంది.
నదికి రెండువైపులా కిలోమీటర్ వరకు 110 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తుంది.
పీపీపీ విధానంలో ప్రైవేట్ కంపెనీలకు ఎం త లాభం ఉంటుంది?, ప్రభుత్వానికి ఎం త ఆదాయం ఇస్తారు? ఇలా ప్రతి దశలో విధి విధానాల ఖరారు బాధ్యత మెయిన్‌హార్ట్ కన్సార్టియం చూస్తుందని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
మూసీకి రెండువైపులా ప్రైవేట్ కంపెనీలు స్థలాలను 30-50 ఏండ్లకు లీజుకు తీసుకొని రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయా లు, వినోద కేంద్రాలు నిర్మిస్తాయి.
ఆదాయంలో ఒప్పందం మేరకు ప్రభుత్వానికి ఏటా కొంత చెల్లిస్తారు