తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఐటీ  దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఐటీ  దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.

క్రిస్టియన్ మిషనరీలతో పాటు సంస్థల్లో అధికారులు సోదాలు చేపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 40 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అల్వాల్, పటాన్ చెరువు, కీసర, జీడిమెట్ల, బొల్లారం, సికింద్రాబాద్, మెదక్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా హైదరాబాద్ లో ప్రతీ నెలలో ఎక్కడో ఓ చోట ఐటీ రైడ్స్ జరుగుతుండగా..తాజాగా మరోసారి ఐటీ  దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ రైడ్స్ ముగిసిన తరువాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది,

ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. బాలవికాసకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీలతో పాటు సంస్థల్లో అధికారులు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సంస్థకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా ఆధారాలతో అధికారులు పెద్ద ఎత్తున ఈ సోదాలు చేపట్టినట్టు సమాచారం. జంట నగరాల్లోని కీసర, ఘట్ కేసర్, మల్కాజ్ గిరి సహా 40 ప్రాంతాల్లో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. అయితే రైడ్స్ ముగిస్తే కానీ ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

కాగా కొన్నిరోజుల క్రితం కూడా ఐటీ అధికారులు వసుధ ఫార్మా కంపెనీలో ఐటీ రైడ్స్ చేపట్టారు. ఆ తరువాత దిల్ సుఖ్ నగర్ లోని గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు ముమ్మర దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ వంటి కంపెనీల్లో కూడా ఐటీ రైడ్స్ చేపట్టారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు.

గతంలో మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా ఐటీ అధికారులు భారీగా పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఇప్పుడు మరోసారి ఐటీ రైడ్స్ జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది.