తల్లిని చంపి ప్లాస్టిక్ బ్యాగ్ లో కుక్కిన కూతురు, నెలల పాటు బ్యాగులోనే తల్లి మృతదేహం

మహారాష్ట్రలోని ముంబాయిలో దారుణం వెలుగుచూసింది. తల్లినే తన కూతురు హత్య చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన సంచలనం రేపుతోంది…

మహారాష్ట్రలోని ముంబాయిలో దారుణం వెలుగుచూసింది. తల్లినే తన కూతురు హత్య చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన సంచలనం రేపుతోంది. ముంబాయిలోని లాల్ బహుగ్ ప్రాంతంలో ఆ తల్లికూతుర్లు ఉండేవారు. అయితే ఓ రోజు 21 ఏళ్ల కూతురు తన తల్లినే చంపాలని అనుకుంది. అనుకున్నట్లుగానే హత్య చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ తన తల్లి మృతదేహాన్ని కుక్కింది. ఒకరోజు కాదు వారం కాదు ఏకంగా కొన్ని నెలల పాటు ఆ బ్యాగులోనే తన తల్లి మృతదేహాన్ని ఉంచింది ఆ కూతురు. మంగళవారం రోజున ఆ మృతురాలి సోదరుడు, అల్లుడు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ తల్లికూతుర్లు ఉంటున్న అపార్ట్ మెంట్ కి వెళ్లి అక్కడ వెతికారు. ఇంతలోనే వాళ్లకి ఓ బ్యాగు కనిపించింది. విప్పి చూస్తే కూళ్లిపోయిన ఆ తల్లి మృతదేహం కనిపించింది

వెంటనే ఆ తల్లి కూతుర్ని పోలీసులు అరెస్టు చేసారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రస్తుతం ఆ తల్లి కూతుర్ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆ కూతురు తన తల్లిని ఎందుకు చంపింది. ఆ తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ లో కొన్ని నెలల పాటు ఎందుకు ఉంచిది అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న హత్యలు గమనిస్తే చాలా సంఘటనల్లో హత్య చేయబడ్డ వారి మృతదేహాలు నిందితుల ఇళ్లలోనే దొరుకుతున్నాయి. ఇటీవల దిల్లీలోని శ్రద్దా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటం కలవరపెడుతోంది.