EDతో కవిత ఢీ…!! తన ప్రతినిధి ద్వారా EDకి లేఖ

ఈడీతో కవిత ఢీ…!! తన ప్రతినిధి ద్వారా ఈడీకి లేఖ

11 న జరిగిన విచారణలో చట్టాలను ఉల్లఘించి కవిత కు దొరికిపోయిన ఈడీ.

దర్యాప్తు న్యాయంగా జరగడం లేదు – పక్షపాతంతో కక్షపూరితంగా జరుగుతోంది.

ఎమ్మెల్సీగా, చట్టాలు చేసే వ్యక్తిగా మానవ హక్కుల, మహిళా హక్కుల పరిరక్షణ నా బాధ్యత.. నా విషయంలోనే హక్కుల ఉల్లంఘన జరుగుతోంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి..?

PMLA చట్టం ఇప్పటి వరకు 68 సార్లు మారింది.. మారిన ప్రతిసారి ఎవరో ఒకరి న్యాయ పోరాటంతోనే సాధ్యమైంది.. కాబట్టి కవిత న్యాయ పోరాటం చేస్తుంది.

ఇప్పటికే సిబిఐకి ప్రత్యక్షంగా ఒక సారి, వివరాలు పంపి ఒకసారి..

ఇలాగే ఈడికి కూడా రెండు సార్లు.. మొత్తం నాలుగు సార్లు విచారణకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత.

సెక్షన్ 160 సీఆర్పీసీ కింద మహిళను విచారించే సమయంలో ఇంటికి వెళ్లి విచారించాలి. కానీ నన్ను ఈడీ ఆఫీసుకు పిలవడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించింది.

ఈడీ తన పరిధిలో లేని అంశాలను విచారణలో ప్రస్తావించడం, ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకం.

ఈడీ తన పరిధి దాటి వ్యవహరిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 (2) ను ఉల్లంఘిస్తోంది.

పోరాటం అంటే కేవలం వీధుల్లో మాత్రమే కాదు.. వ్యూహాత్మకం కూడా.

గొర్రె కసాయి వారిని నమ్మడం నిన్నటి మాట.. తప్పుడు ఉద్యేశంతో మన మీద దాడి చేసే తోడేళ్లను, కోర్టులో నిలబెట్టి తోలు తీయడం నేటి బాట ఎదుటివాడి వాడు తొండి గేమ్ ఆడితే..మనం మొండి గేమ్ ఆడాలి.

విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖాస్త్రాన్ని సంధించారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ తాజా సమన్లలో ఎక్కడా పేర్కొనలేదని అందులో ప్రస్తావించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. దర్యాప్తు న్యాయపరంగా, చట్టప్రకారం జరగడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.

సుప్రీంకోర్టు ఈ నెల 24న తన కేసు విచారణకు స్వీకరించే దాకా వేచి చూడాలని, ఏమైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని, లేకపోతే తనకు ఈ-మెయిల్‌ చేయవచ్చని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. విచారణకు వీడియో కాన్ఫరెన్స్ లేదా ఫోన్ లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

2023 మార్చి 7న ఈడీ సమన్లు పంపినపుడు “నేను మహిళను కాబట్టి, చట్ట ప్రకారం నన్ను డైరెక్టరేట్‌ ఆఫీసుకు పిలవకూడదు. ఆడియో, వీడియో ద్వారా జరిగే విచారణకు నేను సిద్దం. నా ఇంటికి కూడా వచ్చి విచారణ జరిపించవచ్చు” అని చెప్పాను. అయినప్పటికీ మీరు అందుకు నిరాకరించి, ముఖాముఖి విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టారు.నేను చట్టాన్ని వివరించినప్పటికీ మీరు అంగీకరించక పోవడంతో, దర్యాప్తుకు సహకరించాలన్న ఉద్దేశంతో మార్చి 11న విచారణకు హాజరయ్యాను.

మార్చి 11న జరిగిన విచారణను బట్టి చూస్తే నేను నాకు తెలిసినంత మేరకూ దర్యాప్తునకు సహకరించానన్న విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. నాకు తెలిసినంత మేరకు సమాచారాన్ని ఇచ్చాను. అయినప్పటికీ చట్టానికి విరుద్ధంగా మీరు నా మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనపరుచుకున్నారు. ఫోన్‌ తేవాలని మీరు ఎక్కడా చెప్పకున్నా, మీరు ఆరోపిస్తున్న నేరానికి నా ఫోనుకు ఏం సంబంధమో చెప్పలేదు. ఫోన్ అంటే కేవలం మెస్సేజ్ లు మాత్రమే కాదు.. అందులో ఫొటోలతో పాటు అనేక వ్యక్తిగత సమాచారం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మహిళ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం సెక్షన్‌ 50(5) కింద అలాంటి అధికారం ఉందని మీరు చెప్పారు. నేను తీసుకున్న న్యాయ సలహా ప్రకారం అది చట్ట వ్యతిరేకం. పైగా ఫోన్‌లో ఉన్న అంశాలు నా ప్రైవసీ హక్కుకు సంబంధించినవి. అంతేకాక, సూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను రాత్రి 8.30 గంటల వరకూ కూర్చోబెట్టి చివరకు 16 న రావాల్సిందిగా మరోసారి సమన్లను చేతికిచ్చారు.

సమన్లను చూస్తే అందులో ఎక్కడా వ్యక్తిగతంగా లేదా ప్రతినిధిని పంపడం ద్వారా హాజరు కావాలని చెప్పలేదు. కనుక, నేను నా తరఫున భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌ కుమార్‌ను నా ప్రతినిధిగా పంపుతున్నాను.
ఇదెలా ఉన్నా గతంలో మాదిరి దర్యాప్తుకు ఎప్పుడైనా సహకరించేందుకు నేను సిద్ధం. అయితే, అన్ని పరిస్థితుల్లోనూ మీరు కూడా చట్టానికి కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుంది.

అరెస్టయిన ఒక నిందితుడితో ముఖాముఖి విచారణ జరిపిస్తామన్న పేరుతో నన్ను మార్చి 11న పిలిపించినప్పటికీ ఎవరినీ నా ముందు ప్రవేశ పెట్టక పోవడం అన్నిటికన్నా దిగ్ర్భాంతికరం. అదేమని అడిగితే ప్లాన్‌ మార్చుకున్నామని భానుప్రియ మీనా అనే అధికారి తెలిపారు. అందువల్ల దర్యాప్తు పవిత్రమైన న్యాయ సూత్రాల ప్రకారం జరగడం లేదని, స్వేచ్ఛగా, సజావుగా నిష్పాక్షికంగా దర్యాప్తు జరగడం లేదని నాకు అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే, రాజ్యాంగపరంగా నా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని భావించి నేను ఆర్టికల్‌ 32 కింద సుప్రీంకోర్టు తలుపు తట్టాను

నేను నా జీవితమంతా సమాజం కోసం అంకితం చేశాను. ఎప్పుడూ చట్టానికి కట్టుబడి ఉంటాను. ఈ దేశపు మహిళా నేతగా, పౌరురాలిగా మహిళల హక్కుకు సంబంధించి అమలులో ఉన్న చట్టానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా చూడడం నా విధి. ఒక చట్టసభ ప్రతినిధిని అయిన నా హక్కులనే ఉల్లంఘించినపుడు న్యాయ పాలన అమలు అయ్యేలా మాత్రమే కాక, చట్టాన్ని ఏ ఏజెన్సీ ఉల్లంఘించకుండా అన్ని చర్యలు తీసుకోవడం నా బాధ్యత.

ఈడీ, సుప్రీం కోర్టు కంటే గొప్పది కాదు…!!! నా అంశంలో సుప్రీం కోర్టు విచారించే వరకు ఎదురు చూడండి.