మహిళ మృతి కేసు హత్యగా మార్పు…
సీసీ పుటేజీ ఆధారంగా నిర్ధారించిన బద్వేలు పోలీసులు..
బద్వేలు పట్టణంలో జాతీయ రహదారిలోని ఇండియన్ పెట్రోలు బంకు వద్ద బుధవారం రాత్రి జరిగిన లక్ష్మి (27) రోడ్డు ప్రమాద ఘటన హత్య కేసుగా గురువారం పోలీసులు నిర్ధారించారు.
బద్వేలులోని ఐలమ్మ కాలనీకి చెందిన లక్ష్మి వాణిలో మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందడం తెలిసిందే.
ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఈమె అవసరమైన పనిపై ఇంటి నుంచి బయటకు వచ్చారు…
తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డుపై స్థానిక వల్లెలవారిపల్లెకు చెందిన చంద్రశేఖర్ చేయి తగలడంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగారు.
వాహ నాలు రద్దీగా ఉన్న ఆ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగే క్రమంలో చంద్రశేఖర్ చేయి తగల డంతో లక్ష్మీ లారీ చక్రాల కింద పడిపోయారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు..
ఈ ఘటనకు సంబంధించి నిందితుడు చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు.
అక్కడ ఆమెపై జరిగిన గొడవ ఘటన దృశ్యా లను సీసీ పుటేజీ ఆధారంతో గుర్తించి కేసును హత్య కేసుగా మార్పు చేశామన్నారు…