CM KCR , మంత్రి KTR ల ఆదేశాల మేరకు ప్రీతి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందచేసిన… మంత్రి ఎర్రబెల్లి

ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుదాం.

ప్రీతికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగవద్దు.

ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం.

ప్రీతి కుటుంబ సభ్యుల్లో మిగతా వారికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తాం.

ప్రీతి మరణాన్ని రాజకీయం చేయవద్దు.

విచారణ నివేదికలను అనుసరించి కఠిన చర్యలు.

ప్రీతి ఇంటికి మరోసారి వెళ్ళి , CM KCR , మంత్రి KTR ల ఆదేశాల మేరకు ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందచేసిన… మంత్రి ఎర్రబెల్లి

గిర్ని తండా (జనగామ జిల్లా – కొడకండ్ల – మొ0డ్రాయి) :

ప్రీతి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. ఆమెను తిరిగి తీసుకురాలేము కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది. రాజకీయాలు చేయడం కాదు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ముఖ్యం. ఆదిశగా సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆలోచిస్తున్నారు. వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ సహాయంతో పాటు నియోజకవర్గం పరంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నేను కలిసి ఇచ్చిన హామీ మేరకు హార్దిక సహాయాన్ని అందించాం. ఆ కుటుంబాన్ని ఇంకా అన్ని విధాలుగా ఆదుకుంటాం. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రీతి సొంత గ్రామం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం మొ0డ్రాయి సమీపంలోని గిర్ని తండాకు మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం వెళ్లారు. ప్రీతి ఇంటికి వెళ్లిన మంత్రి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ హామీ తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు వారి సమస్యలు విన్నారు. విచారణ జరుగుతున్న తీరు, వస్తున్న నివేదికల ఆధారంగా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆ గ్రామ ప్రజల సమక్షంలో మంత్రి మాట్లాడారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కామెంట్స్…

ప్రీతి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు.

బాగా చదువుకొని, డాక్టర్ గా ఎదిగిన బిడ్డ పోవడం ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత.

ప్రీతి మరణాన్ని రాజకీయం చేయడం కాదు ఆ కుటుంబానికి అండగా ఉందామ్.

కొందరు చావులను కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారు. లబ్ధి పొందాలని చూస్తున్నారు.

ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడుదాం. ప్రీతికి జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు.

విచారణ జరుగుతుంది నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటాం.

ఆమె కన్యాయం చేసిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తాం.

పదేపదే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు చెబుతున్నట్లు.. ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నారు.

వారు ప్రకటించిన సహాయాన్ని అందించడమే కాకుండా, స్వయంగా నియోజకవర్గ పార్టీ శ్రేణులు అంతా కలిసి మరింత సాయాన్ని అందించాము.

ఇప్పుడు ఆ సహాయాన్ని స్వయంగా ఆ కుటుంబానికి అందజేశాం. చేసిన సహాయాన్ని చెప్పుకోవడం కాదు.

ప్రీతి కుటుంబంలోని సభ్యులకి ఉద్యోగపరమైన అవకాశాన్ని కూడా ఆలోచిస్తున్నాం.

ప్రీతి కుటుంబానికి అండగా ఉంటాం అన్ని విధాలుగా ఆదుకుంటాం.

ఆ కుటుంబం మా కుటుంబం వేరు కాదు.

ప్రీతి తల్లి శారద కామెంట్స్…

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మా కుటుంబం రుణపడి ఉంది. వారికి ఏం చేసినా ఆ రుణం తీర్చుకోలేము.

ప్రీతి ఘటన జరిగిన నాటి నుంచి ఎర్రబెల్లి గారు మాకు అండగా ఉన్నారు. అన్ని విధాలుగా ఆదుకున్నారు.

ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అన్ని విధాలుగా మాకు సాయం అందించారు.

ప్రీతి లేని లోటుని ఎవరు తీర్చలేరు కానీ ప్రీతికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదంటే దోషులను కఠినంగా శిక్షించాలి.

అప్పుడే ప్రీతీ ఆత్మ శాంతిస్తుంది.

మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు ప్రీతి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.