సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ బాధితులకు ఎక్సగ్రేషియాదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన…
న్యూఢిల్లీ :
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు పోవడం తనను ఎంతో బాధించిందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇక స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి బాధిత కుటుంబాలకు ఆ సాయం అందజేయనున్నట్లు.. అలాగే గాయపడిన వాళ్లకు రూ.50వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు.