TSPSC  బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం…?

TSPSC  బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం…?

హైదరాబాద్ :

TSPSC బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ లీకేజ్‌పై  CM KCR సీరియస్‎గా ఉన్నట్లు తెలుస్తోంది.

TSPSC చైర్మన్ జనార్ధన్‌రెడ్డిని ప్రగతిభవన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన హుటాహుటిన ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో CM KCR మంత్రులు హరీష్‌రావు , KTR తో భేటీ అయ్యే అవకాశం ఉంది..

కాగా, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  TSPSC ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 తోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం TSPSC  అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయంతో మొత్తం ఆరు పరీక్షలను రద్దు చేసినట్లయింది.