అమాయక ప్రజలకు టోకరా వేస్తున్న…. సైబర్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

అమాయక ప్రజలకు టోకరా వేస్తున్న…. సైబర్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన చందానగర్ పోలీసులు….

శేరిలింగంపల్లి :

సైబరాబాద్ పరిధిలో పోలీసుల కళ్ళు గప్పి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ సైబర్ ముఠాను చందానగర్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. వద్ద నుండి 3 లాప్ టాప్ లు, 1 ద్విచక్ర వాహనం, 15 సెల్ ఫోన్స్, లక్ష నలభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డిసిపి శిల్పవల్లి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

చందానగర్ పోలీసుల అదుపులో ఇద్దరు సైబర్ నేరగాళ్ల మరొకరు పరారీలో ఉన్నారని, పోలీసుల అదుపులో వేముల నాగ ప్రేమ్, బానావత్ కుమార్… జైపూర్ కి చెందిన రాహుల్ పరారీ లో ఉన్నట్టు ఆమే తెలిపారు…. కస్టమర్ లకి ఫోన్ చేసి, డౌన్లోడ్ చేసిన యాప్ లో ద్వారా ఓటీపీలు చెప్పమని వారు చెప్పిన ఓటీపీల ద్వారా సైబర్ నేరగాళ్లు నగదు దండుకుంటున్నారని ఆమె తెలిపారు. క్విక్ సపోర్ట్, అని డెస్క్ ,సర్వర్ మంకీ ,క్విక్ షేర్ ద్వారా కస్టమర్లు చేత డౌన్లోడ్ చేపిస్తూ లక్షలు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు…వీరిపై మొత్తం తెలంగాణలోని 41 పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి…

మొత్తం లోస్ వాల్యూ 22 లక్షలు ఉండగా… వారి వద్ద నుండి పది లక్షల ప్రాపర్టీ నీ రికవరీ చేసినట్లు ఆమె తెలిపారు. కేసును చేదించిన చందానగర్ క్రైమ్ బృందానికి ఆమె అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మియాపూర్ ఏసిపి నరసింహారావు, చందనగర్ సీఐలు క్యాస్ట్రో, పాలవెల్లి, ఎస్సైలు రఘు, నాగేశ్వరరావు తో పాటు పలువురు పాల్గొన్నారు.