రేవంత్ రెడ్డి నీవు PCC అధ్యక్షుడువా… గల్లీ లీడర్ వా… నా సవాల్ కు జవాబు చెప్పు…. MLA రవిశంకర్

రేవంత్ రెడ్డి నీవు PCC అధ్యక్షుడువా… గల్లీ లీడర్ వా… నా సవాల్ కు జవాబు చెప్పు…. MLA రవిశంకర్

జగిత్యాల జిల్లా :

రేవంత్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన చేసిన ఆరోపణలు సంబంధించి ఆరోపణలు నిజమైతే నువ్వు నిలబడాలి సమాచారం ఇవ్వాలి దీనిపైన క్లారిటీ ఉందా రేవంత్ రెడ్డి… నా సవాల్ కు జవాబు చెప్పు ! అని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ రేవంత్ రెడ్డి కి సవాల్ చేశారు. ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పేపర్ లీకేజీ సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విచారణ ఆదేశించింది.దీనిని గందరగోళం పట్టించి గతంలో మీరు చేసిన తప్పులను వక్రీకరణ చేసుకోడానికి నిరుద్యోగులు రెచ్చగొట్టడానికి లేనిపోని అబద్ధాలు చెప్తున్నావు రేవంత్ రెడ్డి నీవు పీసీసీ అధ్యక్షుడువా గల్లీ లీడర్ వా రేవంత్ రెడ్డి నిన్న కేటీఆర్ పిఏ తిరుపతికి సంబంధం ఉందని మల్యాల మండలంలో వందకు పైగా మందికి 100 మార్కులు వచ్చాయని ఒకసారి అదే నిమిషంలో తిరిగి పది మందికి 100 కు పైగా మార్కులు వచ్చాయని రెండు ద్వంద రకాల మాటలు మాట్లాడావు రేవంత్ రెడ్డి నిజంగా కేటీఆర్ పిఎ కు సంబంధించిన వంటి ఆధారాలు ఉంటే అయిన లీవ్ చేసినటువంటి సమాచారం నీ దగ్గర ఉంటే అవి మాకు ఇస్తే స్వాగతిస్తాం ఎంత పెద్ద వారైనా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు.

తిరుపతి పేపర్ లీక్ చేశాడని ఆధారాలు ఉంటే మా ప్రభుత్వానికి విచారణ బృందానికి ఇవ్వండి లేదా బహిరంగపరచండని డిమాండ్ చేస్తున్నా . రేవంత్ రెడ్డి అసలు దరఖాస్తులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి ఎంతమంది రాశారు పరీక్ష విధానం నీకెలా తెలిసాయి ఈ విషయం కేవలం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కి తప్ప వేరే వారికి తెలిసేలా ఆస్కారం లేదు అంటే దీనిని బట్టి చూస్తే టీఎస్పీఎస్సీలో జరిగే ప్రతి సంవత్సరం మీకు వస్తుందని మాకు అనుమానాలు వస్తున్నాయి పేపర్ లీకేజ్ లో కూడా మీకు సంబంధం ఉందని ఎందుకు అనుకోరాదు . నిజంగా మీ దగ్గర లిస్టు ఉంటే ఎందుకు బహిరంగపరచడం లేదు పిఎ లీక్ చేశారని సమాచారం నీ దగ్గర ఉంటే బహిరంగపరచు ఇలాంటి సమాచారం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం ఖబర్దార్ రేవంత్ రెడ్డి మీకు ప్రజాదారణ లేదు కాబట్టే బస్సు యాత్రలు చేపట్టారు. పేపర్ లీకేజ్ అంటూ పబ్బం గడుపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు ,సిరిసిల్లలో జరిగినటువంటి ఆత్మహత్యను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు .నవీన్ కుమార్ అనే వ్యక్తి అసలు గ్రూప్ కె దరఖాస్తు చేయలేదు గ్రూప్ కు దరఖాస్తు చేశాడని పరీక్షలకు సిద్ధమవుతుందని పేపర్ లీకేజీ వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇలా పోస్ట్ చేసిన పోస్ట్ ఇది తప్పు అని స్వయంగా కుటుంబ సభ్యులు చెప్పిన ఈరోజు పలు పత్రికలలో కూడా ప్రచారం అయ్యాయి, అలాగే కుటుంబ సభ్యులు మీరు చేసిన కామెంట్స్ ను అసహ్యించుకున్నారు . ఆయిన మీరు పదేపదే అబద్ధాలు చెబుతున్నారు ప్రజలను మోసగించడంలో ముందుకు పోతున్నారు కేటీఆర్ ని బధనం చేయాలని బురదచల్లే ఉద్దేశంతో ఎటువంటి ఆరోపణలు చేస్తే సత్తా సామర్థ్యం లేక ఆధారాలు లేక పీఏ తిరుపతిని అడ్డుపెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు. ఇలాంటి అలిగేషన్ సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే బహిరంగ పరచాలని నేను సవాల్ విసురుతున్న… గత 18 సంవత్సరాలుగా మానవ విలువలు పాటిస్తూ మంత్రి కేటీఆర్ కు వ్యక్తిగత కార్యదర్శిగా నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న తిరుపతి పై వస్తున్న ఆరోపణ తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు… ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ ,నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్ ,మల్యాల జెడ్పిటిసి రామ్మోహన్ రావు ,సింగిల్ విండో చైర్మన్లు సాగర్ రావు ,మధుసూదన్ రావు, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు సుభాన్ ,మల్యాల మండలానికి చెందిన సర్పంచులు ఎంపిటిసిలు నాయకులు పాల్గొన్నారు.