హైదరాబాద్ :
కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతున్న వేళ.. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ బరితెగించి దాడులకు దిగిందన్న ఆయన.. ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందంటూ సోమవారం సాయంత్రం ఆ ప్రకటనలో పేర్కొన్నారాయన. ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొన్న వేళ.. ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
దుష్ఫ్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. ఎప్పుడైనా ధర్మమే జయిస్తుంది. తెలంగాణ సమాజం బీఆర్‌ఎస్‌ను ఎన్నడూ వదులుకోలేదు. చిల్లరమల్లర రాజకీయ శక్తులను ఏనాడూ ఆదరించరు. ప్రజలే కేంద్ర బిందువుగా బీఆర్‌ఎస్ పని చేస్తుంది అని తన సందేశంలో పేర్కొన్నారాయన.
లక్ష కుట్రలను చేధించి నిలిచిన పార్టీ మనది(టీఆర్‌ఎస్-బీఆర్‌ఎస్). నాడు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా?. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని దుష్ప్రచారానికి దిగుతున్నాయి. ఆ ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలి. బీఆర్‌ఎస్ ఏర్పడిందనే బీజేపీ బరితెగించి దాడులకు పాల్పడుతోంది. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డుకుంటోందని లేఖలో మండిపడ్డారాయన.