బాలికలతో అర్ధనగ్న నృత్యాలు చేయించిన టీచర్

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తన విధులను మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్స్లు చేయించి, వాటిని వీడియోలు తీశాడు.

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తన విధులను మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్స్లు చేయించి, వాటిని వీడియోలు తీశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. జబల్పుర్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రామింగ్ ఠాకుర్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అతడుఈ నెల 11న.. 4, 5వ తరగతి చదువుతున్న కొందరు బాలికలతో పాఠశాల గదిలో బలవంతంగా అర్ధనగ్నంగా నృత్యాలు చేయించాడు. ఆ దృశ్యాలను తన

ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు. ఓ బాలిక ఈ విషయాన్ని తన తల్లికి తెలపడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. ఆమె చిన్నారుల కుటుంబీకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు.