WhatsApp లో వచ్చిన ప్రకటనకు చూసి మోసపోయిన బాధితుడు :
కేసు యొక్క సంక్షిప్త వివరాలు ఏమిటంటే :
కొడిమ్యాల గ్రామానికి చెందిన సింగిరెడ్డి తిరుపతిరెడ్డి యొక్క భార్య సింగిరెడ్డి వసంత పేరుమీద ఎస్ వి షీట్ ఇండస్ట్రీ తిప్పన్నపేట గ్రామంలో కలదు, ఇండస్ట్రీకి చెందిన రా మెటీరియల్ సప్లై చేస్తామని మహరాష్ట్ర కి చెందిన యూనివర్స్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎస్ వసంత పేరుమీద 9,20,400/- రూపాయలకి కొటేషన్ ను వాట్సాప్ ద్వారా తేదీ 03-08-2022 రోజున పంపించగా, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి అడ్వాన్స్ గా 4 లక్షల రూపాయలను తన యొక్క కరెంట్ అకౌంట్ నుండి పంపించగ మెటీరియల్ గాని మరియు 4 లక్షలు గాని తిరిగి పంపించక పొగ మోసపోయిన అని తెలుసుకొని ఈ రోజు వచ్చి దరఖాస్తు ఇవ్వగా రూరల్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కావున ప్రజలకు తెలియజేయనైనది ఏమనగా సోషల్ మీడియా లో వచ్చిన ప్రకటనలు చూసి వారు తెలిపిన నంబర్లకు ఫోన్ చేసి వారికి డబ్బులు పంపి మోసపోకండి Online లో మోసపోయి మీ డబ్బులు పోయినట్లు అయితే మీరు వెంటనే 1930 కు కాల్ చేయగలరు…. ఇట్లు, CI Jagtial Rural
Telegram లో వచ్చిన ప్రకటనకు చూసి మోసపోయిన బాధితుడు:
కేసు యొక్క సంక్షిప్త వివరాలు ఏమిటంటే: ఫిర్యదుదాడి teligram app ki తేదీ 24.02.2023 రోజున బిట్ కాయిన్ ట్రేడింగ్ గ్రూప్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెట్టింపు అవుతాయని మోసపూరిత ప్రకటన చూసి ప్రకటనలో వున్నా నెంబర్ కు బాధితుడు తన పేటీఎం ద్వారా అట్టి గుర్తు తెలియని వ్యక్తికి11,500/- రూపాయలు పంపినాడు. తర్వాత ఫిర్యదుదారుడు అట్టి గుర్తు తెలియని వ్యక్తి గురించి అడిగితే ఎ మాత్రం స్పందించక పొయ్యేవరకు
మోసపోయ్యానని ఫిర్యదుదారుడిగమనించి ఈ రోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించనైనది.
కావున ప్రజలకు తెలియజేయనైనది ఏమనగా సోషల్ మీడియా లో వచ్చిన ప్రకటనలు చూసి వారి తెలిపిన నంబర్లకు ఫోన్ చేసి వారికి డబ్బులు పంపి మోసపోకండి Online లో మోసపోయి మీ డబ్బులు పోయినట్లు అయితే మీరు వెంటనే 1930 కు కాల్ చేయగలరు.
ఇట్లు… CI Dharmapuri
Facebook లో వచ్చిన ప్రకటనకు చూసి మోసపోయిన వ్యాపారి :
కేసు యొక్క సంక్షిప్త వివరాలు ఏమిటంటే: ఫిర్యదుదారుడు గతములో facebook అను ఒక సోషల్ మీడియా లో ఒక ప్రకటన అది Indian Diary Point పేరు తో వుంది అది చూసి, అట్టి వ్యాపారము లో చాల లాభాలు ఉంటాయని వచ్చిన ప్రకటన చూసి ప్రకటనలో వున్నా నెంబర్ కు ఫోన్ చెయ్యగ ఎవరో గుర్తు తెలియని వ్వక్తి వ్యాపారము పెట్టుబడి పెట్టామని బాగా లాభాలు వస్తాయని ఆశ చూపించిగా ఫిర్యదుదారుడు నమ్మి అట్టి గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్టుగానే మొదట ID/Password కొరకు రూ.లు. 2,500/-, తర్వత మెంబర్ షిప్ గురించి రూ.లు. 12,000/-, MUTUAL Transfort గురించి రూ.లు. 50,000/-, అప్ప్రోవాల్ చార్జెస్ గురించి రూ.లు. 49,300/-, అలాగే మరి కొంత డబ్బు అలాగా పిర్యాదు దారుడు మొత్తం రూ.లు. 1,13,800/-, అట్టి గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్టుగానే తెలియని వ్యక్తి కి అతని ఫోన్ పే నెంబర్ ద్వార డబ్బులను పంపినాడు. తర్వాత ఫిర్యదుదారుడు అట్టి గుర్తు తెలియని వ్యక్తిని వ్యాపారము గురించి అడిగితే ఎ మాత్రం స్పందించక పొయ్యేవరకు
మోసపోయ్యానని ఫిర్యదుదారుడిగమనించి ఈ రోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రరంబించానైనది.
కావున ప్రజలకు తెలియజేయనైనది ఏమనగా సోషల్ మీడియా లో వచ్చిన ప్రకటనలు చూసి వారి తెలిపిన నంబర్లకు ఫోన్ చేసి వారికి డబ్బులు పంపి మోసపోకండి Online లో మోసపోయి మీ డబ్బులు పోయినట్లు అయితే మీరు వెంటనే 1930 కు కాల్ చేయగలరు.
ఇట్లు… CI Metpalli