తెలంగాణ ప్రజలకు శ్రీ శోభ కృత్ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన CM KCR
తెలుగువారి నూతన సంవత్సరమైన శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. బుధవారం రవీంద్రభారతిలో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ, ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలు సంప్రదాయ నాదస్వరంతో ప్రారంభమవుతాయి.
ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ ప్రముఖులకు పురస్కారాలు…
తెలుగువారి నూతన సంవత్సరమైన శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. బుధవారం రవీంద్రభారతిలో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ, ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలు సంప్రదాయ నాదస్వరంతో ప్రారంభమవుతాయి. అనంతరం ముఖ్యఅతిథికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ప్రార్థనాగీతం, వేదాశీర్వచనం, పంచాంగ పఠనం, వేదపండితులు, అర్చకులు, ఆధ్యాత్మికవేత్తలకు సత్కారం తదితర కార్యక్రమాలుంటాయి.