హన్మకొండ జిల్లాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలివెల్పుల గ్రామ హమ్లెట్ విలేజ్ కొత్తపల్లి గ్రామానికి చెందిన మట్టేడ నరేష్ కుమారులు మట్టేడ అహర్షిత్ (16) అన్విక్ (9 ) ఇద్దరు పిల్లలు బుధవారం ఎస్ఆర్ఎస్పీ పెద్ద కెనాల్ లో ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. నీటి ప్రవాహ వేగానికి ఇద్దరు పిల్లలు కొట్టుకుని పోతుoడగా పక్కనే బట్టలు పిండుకుంటున్న చేతాళ్ళ కేతమ్మ అనే మహిళ చూసి అశోక్ అనే వ్యక్తి కి సమాచారం అందించింది. అతను వచ్చి చూడగా ఒక పిల్లవాడి చేతులు మాత్రమే కనపడగా.. వెంటనే కే యూసి పోలీసులకు సమాచారం చేరవే శారు. హుటాహుటిన పోలీసులతో పాటు స్థానిక ఏసీపీ హన్మకొండ కిరణ్ కుమార్ యాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే అగ్నిమాపక సిబ్బందిని, డీఆర్ఎఫ్ టీమ్ కూడా వచ్చి బృందాలుగా ఏర్పడి నీటిలో దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కాని పిల్లల ఆచూకీ లభించలేదు.
ఈ విషయమై ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ..
అన్నీ విభాగాలా సమన్వయoతో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.