TS PSC పేపర్ లీకేజీ… సీట్ ముందుకు రేవంత్ రెడ్డి
టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై సిట్ స్పందించింది. తన వద్ద ఉన్న ఆధారాలతో ఇవాళ హాజరుకావాలని రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ జూబ్లీహల్స్ నివాసం నుంచి సిట్ కార్యాలయానికి బయలుదేరిన ఆయన వాహణ శ్రేణిని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు నిలిపివేశారు. కారు దిగి సిట్ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు.
రేవంత్ తన వాంగ్మూలాల ఆధారంగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సాక్షం ఇవ్వడానికి తనను సిట్ కార్యాలయానికి రావాలని కోరారు. తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన సిట్‌కు అందజేయనున్నారు. ఈ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై రేవంత్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు బీఆర్‌ఎస్ హైడ్రామాను చూశాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నిరసనలను అణిచివేయడానికి యత్నిస్తున్నదని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.
పోలీసుల పాలనే… ప్రజాపాలన లేదు- మల్లురవి
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతున్నదని.. ప్రజా పాలన లేదన్నారు. రేవంత్‌రెడ్డి సిట్ కు హాజరువుతున్నసందర్భంలో తనతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టులు, హౌజ్ అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వాళ్లందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు