భారతదేశంలో చీకటి రోజు… రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు పై MLC జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం..
ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారనడానికి ఇదే నిదర్శనం..
రాహుల్ గాంధీకి అండగా యావత్ భారత దేశం నిలుస్తోంది..
ప్రభుత్వ వైఫల్యం పై ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు..
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించే గలాన్ని నొక్కేందుకు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అధికారం కోసం కులాల పేరిట మతాల పేరిట చీల్చాలని ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ భారత జాతిని ఏకం చేసేందుకు భారత జో డో యాత్ర చేపట్టారన్నారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిన నీరవ్ మోడీ లలిత్ మోడీ ని విదేశాల నుంచి వెనక్కి రప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పార్లమెంట్ లో ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు.
ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిరసిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా వ్యక్తిగత కక్షలతో ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తారో చెప్పడానికి రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు నిదర్శనం అన్నారు.
వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నిందితులు నేరం మోడీ లలిత్ మోడీ లను వెనక్కి రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందడంతో పాటు అండగా నిలుస్తున్నారనే భావన వచ్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ కి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని అన్నారు.
ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని రద్దు చేయడమని విమర్శించారు.
భారతదేశంలోని రాహుల్ గాంధీ అత్యధిక మెజార్టీ 12 లక్షల 76,945 ఓట్లతో గెలుపొందారని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీకి యావత్ భారతదేశం అండగా నిలుస్తుంది అన్నారు.
యూపీఏ పాలనలో నిరుపేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపేందుకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం ప్రవేశపెట్టామన్నారు.
పాలనలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించమని గుర్తు చేశారు.
రైతులకు మద్దతు ధర ప్రకటించడంతోపాటు అమలు చేసేందుకు ఎఫ్సీఐ అండగా నిలిచే లా బలోపేతం చేశామన్నారు.
యూపీఏ పాలనలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 105 కు పెరిగిన పెంపు భారం సామాన్య ప్రజలపై పడనీయకుండ ప్రభుత్వం భరించిందన్నారు.
దేశంలోని రోడ్లు విమానాశ్రయాలు ఓడరేవులు బొగ్గు గనులు ఒక వ్యక్తి ఒకే వ్యక్తి వ్యాపారం కిందికి మార్పిడి చేస్తూ దేశ సంపద కొల్లగొడుతుండడాన్ని ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు.
దేశ సంపదను అదా నీ కొల్లగొడుతుంటే వాస్తవాలు వెలికి తీసేందుకు జేపీసీ నియామకం చేపట్టాలని ప్రతిపక్షాలు అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చిన స్పందన కరువైందన్నారు.
నీతి నిజాయితీకి నిరాడంబరతకు నిదర్శనం రాహుల్ గాంధీ ఆయన వెంట దేశ ప్రజలు ఉన్నారనీ అన్నారు.
రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు చేయడం ప్రజాస్వామ్యనికే చీకటి రోజని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.