సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు… యువతి బలవన్మరణం

సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.

జూబ్లీహిల్స్ :

పోలీసుల వివరాల ప్రకారం..

రోడ్ నంలోని ఇందిరానగర్ నగరవాసి ఆర్. సదానంద్ ప్రైవేటు ఉద్యోగి సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.  అదే ప్రాంతంలో నివసించే రెడపాక పల్లవి (27)తో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మరో యువతిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. తరువాత పల్లవి సహజీవనం కొనసాగింది. కొద్ది రోజులుగా సదానంద్ అకారణంగా ఆమెపై దాడికి పాల్పడుతున్నాడు. ఈనెల 22న రాత్రి 10 గంటలకు పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తిలో నివసించే తల్లికి పల్లవి ఫోన్ చేసి సదానంద్ తనను తీవ్రంగా కొడుతున్నాడని, చనిపోవాలని.. లేదంటే పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నాడని చెప్పింది. 23న తల్లి అక్కడి నుంచి బయలుదేరగా మార్గమధ్యలో ఉండగానే సదానంద్ ఫోన్ చేసి, రాత్రి పల్లవి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపాడు. నగరానికి చేరుకున్న ఆమె తల్లి లక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సదానంద్ను అదుపులోకి తీసుకొన్నారు.