సొంత గూటిలోకి… DS

సొంత గూటిలోకి… DS

నిజామాబాద్ జిల్లా : 

తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ తనకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ భారత రాష్ట్ర సమితిలో మూడేళ్ల క్రితం చేరిపోయారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ స్థానాన్ని కేటాయించారు. కానీ ఆ పార్టీలో డి శ్రీనివాస్కు సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం పలు సందర్భాల్లో ఆయనకు అవమానాలు జరగడం తట్టుకోలేక చివరకు తన సొంత పార్టీలోకి వెళ్లడానికి డి శ్రీనివాస్ సిద్ధమయ్యారు ఆయనతోపాటు ఆయన తనయుడు నిజామాబాద్ నగరపాలక మాజీ అధ్యక్షులు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు ఆదివారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యరావు ఠాక్రే సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం తీసుకొననున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అగ్రనేతగా కాంగ్రెస్ లో డి శ్రీనివాస్ పేరుగాంచాడు రెండుసార్లు గతంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శ్రీనివాస్ తీవ్రంగా కృషి చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి తరువాత రాష్ట్రంలో రెండో స్థానం డి శ్రీనివాస్ కే ఉంది కాంగ్రెస్ అధిష్టానం శ్రీనివాస్ కు మంచి ప్రాముఖ్యతను కల్పించింది మళ్ళీ భారత రాష్ట్ర సమితి నుంచి డి శ్రీనివాస్ ఆయన తనయుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో కి చేరితే, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..